VISHNU BILWA PATRARCHANA PUJA CONCLUDES _ తిరుమ‌ల‌లో ముగిసిన ధ‌నుర్మాస పూజ కార్య‌క్ర‌మాలు 

Tirumala, 14 Jan. 21: As part of Dhanurmasa Vishnu Puja taken up by TTD, the five-day Bilwapatrarchana Vishnu Puja concluded at Vasanta Mandapam in Tirumala on Thursday.

This event was telecasted live on SVBC every day between 6am and 6:30am.

The significance of this fete is that Bilwa (sacred fig) leaves are being revered as Maha Lakshmi which is a symbol of prosperity.  

Usually, Bilwa leaves are prominently used in Sivarchana while Tulasi leaves in Vishnu Puja. But it is only in this sacred month of Dhanurmasa, Sri Maha Vishnu is also offered special puja with Bilwa leaves as per holy texts.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

తిరుమ‌ల‌లో ముగిసిన ధ‌నుర్మాస పూజ కార్య‌క్ర‌మాలు 

తిరుమల‌, 2021 జ‌న‌వ‌రి 14: ప‌విత్ర‌మైన ధ‌నుర్మాసాన్ని పుర‌స్క‌రించుకొని తిరుమ‌ల నాద నీరాజన వేదికపై డిసెంబ‌రు 15వ తేదీ నుండి మార్గశిర విష్ణు వైభవ ప్రవచనం, వ‌సంత మండ‌పంలో జ‌న‌వ‌రి 10వ తేదీ నుండి నిర్వ‌హిస్తున్న శ్రీ విష్ణు బిల్వాప‌త్రార్చ‌న పూజ కార్య‌క్రామ‌లు గురువారం ముగిసింది. ఉద‌యం 6 నుండి 6.30 గంట‌ల వ‌ర‌కు జ‌రిగిన ఈ పూజా కార్య‌క్ర‌మాన్ని శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేసింది.

వ‌సంత మండ‌పంలో ….

ఉద‌యం శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ శ్రీ‌నివాసుడు, న‌మూనా అనంత ప‌ద్మ‌నాభ స్వామివారి విగ్ర‌హ‌న్ని  వ‌సంత మండ‌పంలో వేంచేపు చేశారు. సాధార‌ణంగా శివునికి బిల్వాప‌త్రాల‌తో పూజ నిర్వ‌హిస్తార‌నే విష‌యం తెలిసిందే, కానీ ప‌విత్ర‌మైన ధ‌నుర్మాసంలో మాత్ర‌మే శ్రీ మ‌హా విష్ణువును బిల్వాప‌త్రాల‌తో పూజించ‌డం వ‌ల‌న విశేష శుభ ఫ‌లితాలు క‌లుగుతాయ‌ని వేదాల నుండి తెలుస్తుంది. జ‌నవ‌రి 10 నుండి 14వ తేదీ వ‌ర‌కు తిరుమ‌ల‌లో ఈ పూజ‌ నిర్వ‌హించారు.  

నాద నీరాజన వేదికపై  …

శ్రీ మ‌హా విష్ణువు క‌థ‌లైన‌ భాగ‌వ‌తం, విష్ణు పురాణం విన‌టం వ‌ల‌న ముక్తి ల‌భిస్తుంద‌ని డిసెంబ‌రు 15 నుండి జ‌నవ‌రి 14వ తేదీ వ‌ర‌కు తిరుమ‌ల‌లో ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు.  

లోక క్షేమం కొర‌కు ప్ర‌జ‌లంతా సుఖ సంతోషాల‌తో, ఆయురారోగ్యాల‌తో, సంతోషంగా ఉండాల‌ని శ్రీ‌వారిని ప్రార్ధిస్తూ టిటిడి ఈ పూజ కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించిన‌ విష‌యం విధిత‌మే. 

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.