VISHNU POOJARCHANAM HELD _ వసంత మండపంలో ఆగమోక్తంగా విష్ణు అర్చనం
Tirupati, 21 Jun. 21: As part Jyesta Masa Utsavams, Vishnu Poojarchanam was held at Vasantha Mandapam in Tirumala on Monday.
This program was live telecasted between 3:30pm and 4:30pm for the sake of devotees.
On the occasion of Jyesta Suddha Ekadasi, this fete was observed amidst religious fervor Rukmini Satyabhama Sameta Sri Krishna Swamy was seated on Chinna Sesha Vahanam and the shlokas from Paramatmikopanishat were recited for 24times by Vedic scholars.
It is believed that fasting on this day is equal to having received the fruits of 24 Ekadasis.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
వసంత మండపంలో ఆగమోక్తంగా విష్ణు అర్చనం
తిరుమల, 2021 జూన్ 21: లోక కల్యాణార్థం టిటిడి నిర్వహిస్తున్న జ్యేష్ఠ మాస కార్యక్రమాల్లో భాగంగా సోమవారం తిరుమల వసంతమండపంలో విష్ణు అర్చనం ఆగమోక్తంగా జరిగింది. జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి సందర్భంగా మధ్యాహ్నం 3.30 నుండి 4.30 గంటల వరకు నిర్వహించిన ఈ పూజా కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేసింది.
జ్యేష్ఠ శుద్ధ ఏకాదశిని నిర్జల ఏకాదశి అంటారని, ఈరోజు విష్ణుమూర్తిని భక్తితో అర్చించి తీర్థం మాత్రం స్వీకరిస్తే మొత్తం 24 ఏకాదశుల పూజాఫలం లభిస్తుందని ఈ సందర్భంగా పండితులు తెలిపారు. ఈ సందర్భంగా చిన్నశేష వాహనంపై కొలువుదీర్చిన రుక్మిణీ సమేత శ్రీకృష్ణస్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. పారమాత్మికోపనిషత్ లోని శ్రీకృష్ణ మంత్రాన్ని అర్చకస్వాములు, వేదపండితులు 24 సార్లు పఠించారు. అనంతరం తులసీ దళాలతో అర్చన చేశారు. నివేదన, హారతులు సమర్పించి క్షమాప్రార్థన చేశారు.
ఈ కార్యక్రమంలో పోటు ఏఈఓ శ్రీ శ్రీనివాసులు, అర్చకస్వాములు, వేదపండితులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.