KALIYA MARDANA AVATARAM IMPRESS DEVOTEES_ కాళీయమర్దనాలంకారములో శ్రీకోదండరామస్వామి కటాక్షం

Vontimitta, 1 April 2018: Lord Sri Rama in Kaliya mardana Alankara cheered devotees on Sunday morning in Vontimitta brahmotsavams.

With this the alankara spree came to an end.

Temple AEO Sri Ramaraju and other staff members also took part in this celestial fete.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

కాళీయమర్దనాలంకారములో శ్రీకోదండరామస్వామి కటాక్షం

ఒంటిమిట్ట, 2018 ఏప్రిల్‌ 01: ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదవరోజు ఆదివారం ఉదయం కాళీయమర్దనాలంకాములో స్వామివారు

భక్తులను కటాక్షించారు. ఉదయం 8.00 నుండి 10.00 గంటల వరకు స్వామివారి ఊరేగింపు వైభవంగా జరిగింది. భజన బృందాలు భజనలు, కోలాటాలు ఆడుతుండగా స్వామివారు పురవీధుల్లో విహరించారు.

వాహనసేవ అనంతరం ఉదయం 11.00 నుండి 12.00 గంటల వరకు స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనంతో

శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరాములవారి ఉత్సవమూర్తులకు విశేషంగా అభిషేకం చేశారు.

సాయంత్రం 5.00 గంటల నుండి 5.30 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరగనుంది. రాత్రి 8.00 గంటల నుండి 9.30 గంటల వరకు అశ్వ

వాహనంపై శ్రీకోదండరామస్వామివారు భక్తులకు కనువిందు చేయనున్నారు.

ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి. అందువల్ల అశ్వాన్ని అధిరోహించిన పరమాత్మ ఇంద్రియాలను నియమించే నియామకుడు. పరమాత్మను అశ్వ స్వరూపంగా కృష్ణయజుర్వేదం తెలియజేసింది. స్వామి అశ్వవాహనాది రూఢుడై భక్తులకు దర్శనమిచ్చి తద్వారా తన కల్కి స్వరూపాన్ని ప్రకటిస్తూ కలిదోషాలకు దూరంగా ఉండమని నామ సంకీర్తనాద్యుపాయాలను ఆశ్రయించి, తరించమని ప్రబోధిస్తున్నాడు.

ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో శ్రీ రామరాజు, సూపరింటెండెంట్లు శ్రీ సుబ్రమణ్యం, శ్రీ నాగరాజు ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

ఏప్రిల్‌ 2న చక్రస్నానం

శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం 11.30 నుండి 12.00 గంటల వరకు చక్రస్నానం వైభవంగా జరుగనుంది.

సాయంత్రం 5.30 నుండి రాత్రి 8.00 గంటల వరకు ధ్వజావరోహణముతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయ.

ఏప్రిల్‌ 3న పుష్పయాగం

శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో మంగళవారం ఉదయం 5.30 నుండి రాత్రి 9.00 గంటల వరకు పుష్పయాగం వైభవంగా నిర్వహించనున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.