VONTIMITTA DEVELOPMENT WORKS INSPECTED_ ఒంటిమిట్టను ప్రముఖ దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతాం : టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పుట్టా సుధాకర్‌ యాదవ్‌

Vontimitta, 4 September 2018: TTD Trust Board Chairman along with Tirupati JEO Sri P Bhaskar inspected the ongoing development works in Vontimitta Sri Kodanda Ramalayam, at Kalyana Vedika and in PAC in Kadapa district on Tuesday evening.

Speaking to media, the Chairman said, so far about Rs.67 crores worth works have been completed and TTD is ready to spend another 30crores towards the development of this ancient temple on the lines of Bhadrachalam as per the directives of Honourable CM of AP Sri N Chandra Babu Naidu”, he added.

Tirupati JEO said, over the requests of the locals, 20 more temporary toilets would come up and the works will commence in four months time. We have also contemplated for Integrated multi purpose project and all these works will commence from October onwards”, he maintained.

Adding further the JEO said, the Kalyana Vedika extension works will be completed before next Sita Rama kalyanam.

SEs Sri Ramulu, Sri Venkateswarulu, Estates Officer Sri Vijaya saradhi, DFO Sri Phani Kumar Naidu, EE Sri Jagan Mohan Reddy, DyEO General Smt Gourami, VGO Sri Ashok Kumar Goud were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

ఒంటిమిట్టను ప్రముఖ దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతాం: టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పుట్టా సుధాకర్‌ యాదవ్‌

సెప్టెంబరు 04,  ఒంటిమిట్ట, 2018: రాష్ట్ర ముఖ్యమంత్రి గౌ|| శ్రీ చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు ఒంటిమిట్ట శ్రీకోదండరామాలయాన్ని ప్రముఖ దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతామని టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పుట్టా సుధాకర్‌ యాదవ్‌ వెల్లడించారు. తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌, ఇతర అధికారులతో కలిసి మంగళవారం సాయంత్రం ఒంటిమిట్టలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఛైర్మన్‌ పరిశీలించారు.

ఈ సందర్భంగా టిటిడి ఛైర్మన్‌ మాట్లాడుతూ మాస్టర్‌ప్లాన్‌లో భాగంగా జరుగుతున్న ఇంజినీరింగ్‌ పనులను వేగవంతం చేయాలన్నారు. ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం 20 తాత్కాలిక మరుగుదొడ్లను నాలుగు నెలల్లోపు పూర్తి చేయాలని, ఆలయం ఎదురుగా ఆర్‌వో ప్లాంట్‌ ఏర్పాటుచేసి తాగునీటి వసతి కల్పించాలని అధికారులకు సూచించారు. శాశ్వత ప్రాతిపదికన ఎక్కువ సంఖ్యలో మరుగుదొడ్లు, స్నానపుగదులు నిర్మించాలని ఆదేశించారు.  ఆలయ దక్షిణభాగంలో భక్తుల కోసం ర్యాంప్‌ ఏర్పాటుచేయాలన్నారు. భక్తులకు ఇక్కడ తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని అందుబాటులో ఉంచామని, అవసరాన్ని బట్టి మరింత పెంచుతామని తెలిపారు. ఆలయం ఎదురుగా ఉన్న ప్రాథమిక పాఠశాలను మరోచోటకు తరలిస్తామని, రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ ద్వారా తిరిగి పాఠశాల భవనాన్ని నిర్మించేందుకు ఆర్థికసాయం అందిస్తామని వెల్లడించారు. భద్రతాపరమైన చర్యల్లో భాగంగా సిసిటివి కెమెరాలు ఎక్కడెక్కడ ఏర్పాటుచేయలో గుర్తించాలన్నారు. ఎక్కువ సంఖ్యలో మొక్కలు నాటి పచ్చదనాన్ని మరింత పెంచాలన్నారు.

టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ మాట్లాడుతూ ఒంటిమిట్ట ఆలయం, పరిసర ప్రాంతాల అభివృద్ధికి టిటిడి ప్రణాళికాబద్ధంగా పనులు చేపడుతోందన్నారు. ఈ క్రమంలో ఇంజినీరింగ్‌ పనులను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చామన్నారు. ప్రతి ఏటా కడప జిల్లా యంత్రాంగం సమన్వయ సహకారాలతో జరుగుతున్న రాములవారి కల్యాణాన్ని మరింత మెరుగ్గా నిర్వహించేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. మాస్టర్‌ప్లాన్‌లో భాగంగా ఆలయ పరిసరాల్లో నిర్మాణాలకు సంబంధించి ఈ నెలాఖరులోపు టెండర్లు ఖరారు చేసి వచ్చే నెలలో పనులు ప్రారంభిస్తామన్నారు.

అంతకుముందు టిటిడి ఛైర్మన్‌, జెఈవో కలిసి పుష్కరిణి, వాహన మండపం, హారతి పాయింట్లు, ఆలయ పరిసరాల్లో భక్తులు వేచి ఉండే హాళ్లు తదితర నిర్మాణాల ప్రదేశాలను పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్‌ఇ-4 శ్రీ రాములు, ఎస్‌ఇ(ఎలక్ట్రికల్స్‌) శ్రీ వేంకటేశ్వర్లు, డిఎఫ్‌వో శ్రీ ఫణికుమార్‌నాయుడు, ఎస్టేట్‌ అధికారి శ్రీవిజయసారధి, డెప్యూటీ ఈవో (జనరల్‌) శ్రీమతి గౌతమి, విఎస్‌వో శ్రీ అశోక్‌కుమార్‌ గౌడ్‌, ఇఇ శ్రీ జగన్‌మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.