VONTIMITTA BRAHMOTSAVAMS CONCLUDES_ వైభవంగా శ్రీ కోదండరాముడి చక్రస్నానం

Vontimitta, 2 April 2018: The Navahnika Brahmotsavams at Vontimitta in YSR Kadapa district concluded on a grand religious note with Chakrasnanam and Dhwajarohanam on Monday.

Chakrasnanam: The deities of Lord Sri Rama, Sita Devi and Sri Lakshmana Swam were brought from the temple to Sri Rama Teertham temple tank and performed Snapana Tirumanjanam between 10:30am and 11:30am.

Later the Sudarshana Chakrattalwar was given celestial dip in temple tank waters marking the grand completion of the nine-day festival.

DHWAJAVAROHANAM PERFORMED

On the evening of Monday, the archakas performed Dhwajarohanam, the lowering of Garuda Dhwaja on temple pillar amidst chanting of Vedic Mantras.

With this the Navahnika Brahmotsavams came to an end on a religious note in a successful manner.

Temple officials took part in this fete which was observed between 5:30pm and 8pm.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

వైభవంగా శ్రీ కోదండరాముడి చక్రస్నానం

ఒంటిమిట్ట, 2018 ఏప్రిల్‌ 02: ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక నవాహ్నిక బ్రహ్మోత్సవాల్లో చివరిరోజైన సోమవారం ఉదయం రామతీర్థంలో చక్రస్నానం (అవభృథోత్సవం) నేత్రపర్వంగా జరిగింది. విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించారు.

ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా ఉదయం 4.00 గంటలకు సుప్రభాతంతో స్వామివారి మేల్కొలిపి ఆలయ శుద్ధి, ఆరాధన నిర్వహించారు. ఉదయం 9.30 గంటలకు శ్రీ లక్ష్మణ సమేత సీతారాములవారు తిరుచ్చిలో, సుదర్శన చక్రత్తాళ్వార్‌ పల్లకిలో రామతీర్థానికి ఊరేగింపుగా వేంచేశారు.

అనంతరం ఉదయం 10.30 నుండి 11.30 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో సీతారామ లక్ష్మణ సరసన చక్రత్తాళ్వార్లు పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనంలతో అభిషేకాలు అందుకుని ప్రసన్నులయ్యారు. ఉదయం 11.30 నుండి 12.00 గటల వరకు అర్చకుల వేదమంత్రోచ్ఛారణ నడుమ శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు.

కాగా సాయంత్రం 5.30 నుండి రాత్రి 8.00 గంటల వరకు ధ్వజావరోహణంతో శ్రీకోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

పుష్పయాగం

శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో మంగళవారం సాయంత్రం 5.30 నుండి రాత్రి 9.00 గంటల వరకు పుష్పయాగం వైభవంగా నిర్వహిస్తారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో శ్రీ రామరాజు, సూపరెంటెండెంట్లు శ్రీ సుబ్రమణ్యం, శ్రీ నాగరాజు, ఏఇలు శ్రీమతి కళావతి, శ్రీ గురుప్రసాద్‌, ఇతర అధికార ప్రముఖులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.