VONTIMITTA REVERBERATES TO RAMA NAMA JAPAM _ రాములవారి కల్యాణోత్సవంలో అలరించిన భజన సంగీతం, నృత్యం

As a part of Vontimitta Sri Kodandarama Brahmotsavam, the devotional musical and dance programs organized in the evening on the occasion of Sri Sitarama Kalyanotsavam on Monday night spread devotion vibes throughout.

These programs started from 4 pm.with Nadaswaram-Dolu Vadyam by Smt. Lakshmi Suvarna and team

After that, the vocal faculty of SV college of Music and Dance  Dr. Vandana, Smt Chinnamma Devi and the students sang 40 hymns of Sri Rama Namamrutam Bhajan Sankeertans which immersed audience in Bhakti waves.

Later, the students of Dr. Usharani enthralled with Sita Kalyanam and Ramayana Shabdam and Pahirama Prabho Kuchipudi Dance.  

In this, the aspects of Sri Sitaramula Kalyanam and Sri Ramapattabhishekam were well presented in the form of dance.  

Under the guidance of Sri Ravi Subrahmanyam, the Bharatanatyam performance of Raghuvamsa Sudhambudi and Rama Rama Yanaradha impressed the devotees.

TTD Music and Dance college Principal Smt. Uma Muddubala, lecturers Sri. Anantha Krishna, students and artistes participated.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

రాములవారి కల్యాణోత్సవంలో అలరించిన భజన సంగీతం, నృత్యం

– వీనులవిందుగా సాగిన శ్రీరామ నామామృతం

– మైమరపింపచేసిన శ్రీరామకృతులు నృత్యం

ఒంటిమిట్ట, 2024 ఏప్రిల్ 22: ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి శ్రీ సీతారాముల కల్యాణోత్సవం సందర్భంగా సాయంత్రం నిర్వహించిన సంగీత కార్యక్రమాలు ఆద్యంతం భక్తిభావాన్ని పంచాయి.

సాయంత్రం 4 గంటల నుండి ఈ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ముందుగా ఎస్వీ సంగీత, నృత్య క‌ళాశాల అధ్యాపకులు శ్రీమతి లక్ష్మీ సువర్ణ బృందం నాద‌స్వ‌రం-డోలు వాద్యం మంగళప్రదంగా ప్రారంభమైంది.

ఆ తరువాత ఎస్వీ సంగీత, నృత్య క‌ళాశాల అధ్యాపకులు శ్రీమతి డాక్టర్ వందన, శ్రీమతి చిన్నమ్మ దేవి, విద్యార్థులు కలిసి 40 మంది శ్రీరామ నామామృతం భజన సంకీర్తనలు వీనులవిందుగా గానం చేశారు. భజన సంప్రదాయంలో ఆలపించిన కీర్తనలకు పలువురు భక్తులు గొంతు కలిపి నృత్యం చేశారు.

రామ రామ రామ రామ రామ నామ తారకం….,రామ రామయనరాదా రఘుపతి రక్షకుడని వినలేదా….,రామ రామ రాం రాం రాం…., తదితర భజన కీర్తనలు భక్తులను భక్తిసాగరంలో ముంచెత్తాయి.

అనంతరం ఎస్వీ సంగీత, నృత్య క‌ళాశాల డాక్టర్ ఉషారాణి, ఆధ్వ‌ర్యంలో సీతాకల్యాణం మరియు రామాయణ శబ్దం మరియు పాహిరమ ప్రభో కూచిపూడి నృత్యం మైమరపింపచేసింది. ఇందులో శ్రీ సీతారాముల కల్యాణం, శ్రీరామపట్టాభిషేకంలోని అంశాలను నృత్య రూపంలో చక్కగా ప్రదర్శించారు. శ్రీ రవి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో రఘువంశ సుధాంబుది, రామరామ యనరాధ భరతనాట్య ప్రదర్శన భ‌క్తుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంది.

టిటిడి ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ప్రిన్సిపల్ శ్రీమతి ఉమా ముద్దుబాల, అధ్యాప‌కులు శ్రీ అనంత కృష్ణ, విద్యార్థులు, కళాకారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.