VONTIMITTA SRI KODANDARAMA SWAMY BRAHMOTSAVAMS FROM APRIL 17-25 _ ఏప్రిల్ 17 నుండి 25వ తేదీ వ‌ర‌కు ఒంటిమిట్ట‌ శ్రీ కోదండ‌రామ‌స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాలు

SRI SITA RAMA KALUANAM ON APRIL 22

TTD JEO ALONG WITH KADAPA DISTRICT COLLECTOR REVIEWS ON ARRANGEMENTS

Vontimitta, 25 March 2024: In connection with the annual Brahmotsavams in Sri Kodanda Ramalayam at Vontimitta in from April 17-26, a high-level review meeting besides inspection were held in the temple premises by the top brass officials of TTD and YSR Kadapa district.

The authorities should make extensive arrangements for the convenience of the devotees who come for the mega religious state event of Sri Sita Rama Kalyanam on April 22 said the Kadapa District Collector Sri Vijayaramaraju along with TTD JEO Sri Veerabrahmam who reviewed the ongoing arrangements.

YSR District Collector along with TTD JEO and District SP Sri Siddharth Kaushal conducted a review at Vontimitta on Monday.

During the review meeting, the TTD JEO directed that the officials of all the concerned departments of TTD should coordinate with the district authorities and complete the arrangements for Brahmotsavams expeditiously.

He said Ankurarpanam is on April 16 and Brahmotsavams will begin with Dwajarohanam on April 17 on the auspicious day of Sri Rama Navami. 

He said Hanumanta Vahanam is on April 20, Garudavahanam on April 21 and the state festival of the celestial Sri Sitaram Kalyanam is on April 22 and will be organized in a magnificent way. 

The other important days include Rathotsavam on April 23, Chakrasnanam on April 25 while Pushpayagam is on April 26.

YSR Kadapa District Collector Sri Vijayaramaraju said that the district administration along with TTD are making extensive arrangements to ensure that the devotees who have come for the event will not face any inconvenience. 

As part of this, security, parking, distribution of food offerings, temporary toilets, uninterrupted power supply, first aid centers, RTC buses, sign boards, sanitation, public address system and other departments were reviewed and necessary suggestions were made.

District SP Sri Siddharth Kaushal said that TTD vigilance staff and the district police will make strict security arrangements. 

Instructions were given to the officials on setting up CC cameras, control room and other aspects in all necessary areas.

Joint Collector Sri. Ganesh Kumar, Kadapa Municipal Commissioner Sri. Praveen Chand, Assistant Collector Sri. Maurya Bharadwaj, CVSO of TTD Sri. Narasimha Kishore, CEO of SVBC Sri. Shanmukh Kumar, Chief Engineer Sri. Nageswara Rao, Deputy EO Sri.Natesh Babu, district officials of various departments, TTD officials participated.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

ఏప్రిల్ 17 నుండి 25వ తేదీ వ‌ర‌కు ఒంటిమిట్ట‌ శ్రీ కోదండ‌రామ‌స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాలు

– ఏప్రిల్ 22న సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంట‌ల వ‌ర‌కు శ్రీ సీతారాముల క‌ల్యాణం

– జేఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం

•⁠ ⁠సీతారాముల కల్యాణానికి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేయాలి .

– జిల్లా కలెక్టర్ శ్రీ విజయరామరాజు

ఒంటిమిట్ట‌, 25 మార్చి 2024: ఒంటిమిట్ట‌ శ్రీ కోదండ‌రామ‌స్వామివారి ఆల‌యంలో ఏప్రిల్ 17 నుండి 25వ తేదీ వ‌ర‌కు జ‌రుగ‌నున్న బ్ర‌హ్మోత్స‌వాలు, ఏప్రిల్ 22న సాయంత్రం 6.30 నుండి 8.30 గంట‌ల వ‌ర‌కు శ్రీ సీతారాముల క‌ల్యాణం అత్యంత వైభ‌వంగా నిర్వ‌హించ‌నున్న‌ట్లు టీటీడీ జేఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం చెప్పారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్ శ్రీ‌ విజయరామరాజు, జిల్లా ఎస్పీ శ్రీ సిద్ధార్థ్ కౌశిల్ జిల్లా యంత్రాంగంతో సోమ‌వారం ఒంటిమిట్టలో జేఈవో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ, టీటీడీలోని అన్ని విభాగాలు, జిల్లా యంత్రాంగం, పోలీసులు స‌మష్టి కృషి చేసి ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని జేఈవో అధికారులను కోరారు. గతంలో జరిగిన లోటుపాట్లను సవరించుకుని శ్రీ సీతారాముల కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించాలన్నారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయం చేసుకుని బ్రహ్మోత్సవ ఏర్పాట్లను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు.

ఏప్రిల్ 16వ తేదీ అంకురార్ప‌ణ‌, ఏప్రిల్ 17న‌ శ్రీరామనవమితో స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. ఏప్రిల్ 20వ తేదీ హనుమంత వాహనం, ఏప్రిల్ 21వ తేదీ గరుడవాహనం, ఏప్రిల్ 22వ తేదీ సీతారాముల కల్యాణాన్ని అత్యంత అద్భుతంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 23న రథోత్సవము, ఏప్రిల్ 25న చక్రస్నానం, ఏప్రిల్ 26న పుష్పయాగము జరుగుతాయని చెప్పారు.

వైఎస్ఆర్‌ జిల్లా కలెక్టర్ శ్రీ విజయరామరాజు మాట్లాడుతూ, బ్రహ్మోత్సవాల్లో ప్రధానంగా శ్రీ సీతారాముల కల్యాణానికి విచ్చేసిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ ,జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా భద్రత, పార్కింగ్, అన్నప్రసాదాల పంపిణీ, తాత్కాలిక మరుగుదొడ్లు, నిరంతర విద్యుత్ సరఫరా, ప్రథమ చికిత్స కేంద్రాలు, ఆర్టీసీ బస్సులు, సైన్ బోర్డులు, పారిశుధ్యం, పబ్లిక్ అడ్రస్ సిస్టం త‌దిత‌ర విభాగాల‌పై సమీక్షించి పలు సూచనలు చేశారు.

జిల్లా ఎస్పీ శ్రీ సిద్ధార్థ్ కౌశిల్ మాట్లాడుతూ, టీటీడీ విజిలెన్స్‌ సిబ్బంది, జిల్లా పోలీసు యంత్రాంగం కలిసి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తారన్నారు. అవసరమైన అన్ని ప్రాంతాలలో సిసి కెమ‌రాలు, కంట్రోల్ రూం ఏర్పాటు త‌దిత‌ర అంశాల‌పై అధికారుల‌కు సూచ‌న‌లు చేశారు.

ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ శ్రీ గ‌ణేష్ కుమార్‌, క‌డ‌ప మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ శ్రీ ప్ర‌వీణ్ చంద్‌, అసిస్టెంట్ క‌లెక్ట‌ర్ శ్రీ మౌర్య భ‌ర‌ద్వాజ్‌, టీటీడీ సివిఎస్వో శ్రీ న‌ర‌సింహ కిషోర్‌, ఎస్వీబిసి సిఈవో శ్రీ ష‌ణ్ముఖ కుమార్‌, చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీ నాగేశ్వరరావు, డెప్యూటీ ఈవో శ్రీ న‌టేష్‌బాబు, వివిధ శాఖల జిల్లా అధికారులు, టీటీడీ అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.