WATER FOR TWO YEARS STORED IN TIRUMALA RESERVOIRS – TTD CHAIRMAN _ తిరుమ‌ల జ‌లాశ‌యాల్లో రెండు సంవ‌త్స‌రాల‌కు సరిపడా నీరు : టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి

CHAIRMAN VISITS KUMARADHARA AND PASUPUDHARA RESERVOIRS

 Tirumala, 27 Dec. 19:The water in the twin reservoirs of Kumaradhara and Pasupudhara in Tirumala will suffice the water requirements of devotees for the next two years, said TTD Trust Board Chief Sri YV Subba Reddy.

Speaking to reporters after a visit to both the reservoirs along with officials on Friday, the Chairman said that for the first time in ten years both the reservoirs of Kumaradhara and Pasupudhara were filled to their full capacities apart from Akasha Ganga in Tirumala and Kalyani dam in Tirupati with abundant rainfall since July. TTD Board had also decided to invest Rs.400 crore on the Balaji Reservoir to permanently resolve the water needs of devotees in Tirumala.

He said the TTD had also resolved to extend further the Jala prasadam program at Tirumala and from the coming  Sankranti festival, all plastic bags and bottles will be banned on the hill shrine.

TTD Chief Engineer Sri Ramachandra Reddy, SE Electrical Sri Venkateswarlu, SE-2 Sri Nageswar Rao,  EEs Sri Srihari, Sri Mallikarjun Prasad, Sri Chandrasekhar, and others participated.  

Earlier, the Chairman held a meeting on HDPP activities at Annamaiah Bhavan in Tirumala on Friday. He said  that the services of Veda Parayanamdars and Veda Pathasalas would be utilized in the propagation of  Sanatana Hindu Dharma. Construction of temples in dalitwadas will soon be taken up in all Dalitwadas with the funds of SRIVANI Trust. TTD would utilise the services of  NGOs in AP and Telangana to take up easy to read spiritual booklets in schools of these two states and thereby promote Sanatana Hindu Dharma from the roots.

He said the TTD board will decide during its next meeting to take up Srivari Vaibhavotsavalu in a big way in District Head Quarters ,towns, cities, pilgrim centers across the country and also wherever TTD temples are situated.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI  

తిరుమ‌ల జ‌లాశ‌యాల్లో రెండు సంవ‌త్స‌రాల‌కు సరిపడా నీరు : టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి

కుమార‌ధార, ప‌సుపుధార జ‌లాశ‌యాల‌ను ప‌రిశీలించిన ఛైర్మ‌న్‌

డిసెంబరు 2019, తిరుమ‌ల 27: తిరుమలలోని జ‌లాశ‌యాల్లో రాబోవు రెండు సంవ‌త్స‌రాలు భక్తులకు సరిపడా నీరు అందుబాటులో ఉందని టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి వెల్లడించారు. తిరుమలలోని కుమార‌ధార, ప‌సుపుధార జ‌లాశ‌యాల‌ను శుక్ర‌వారం టిటిడి ఛైర్మ‌న్, అధికారుల‌తో క‌లిసి ప‌రిశీలించారు.

 ఈ సందర్భంగా ఛైర్మ‌న్‌ మీడియాతో మాట్లాడుతూ గ‌త 10 సంవ‌త్స‌రాల‌లో తొలి సారిగా తిరుమ‌ల‌లోని డ్యామ్‌లు పూర్తిస్థాయిలో నిండాయ‌న్నారు. శ్రీ‌వారి ఆశీస్సుల‌తో ఈ సంవ‌త్స‌రం జూలై నుండి విస్తారంగా వ‌ర్షాలు కురిశాయ‌న్నారు. త‌ద్వారా తిరుమ‌ల‌లోని కుమారధార‌, ప‌సుపుధార, ఆకాశ‌గంగ, పాపావినాశ‌నం,  తిరుప‌తిలోని క‌ల్యాణి డ్యామ్‌లో జ‌లాశ‌యాల్లో పూర్తిస్థాయిలో నీటి నిల్వ‌లు ఉన్నాయ‌న్నారు. ఇంకా వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉన్నందున నీటి నిల్వ‌లు ఇంకా పెరుగుతాయ‌న్నారు. వీటితో పాటు తిరుమ‌ల‌కు శాశ్వ‌తంగా నీటి అవ‌స‌రాలు తీర్చేందుకు రూ. 400 కోట్ల‌తో బాలాజి రిజ‌ర్వాయ‌ర్ నీటిని వినియోగించుకునేందుకు టిటిడి బోర్డు తీర్మానించింద‌ని తెలిపారు.

తిరుమ‌ల‌కు విచ్చేసే భ‌క్తులు జ‌ల‌ప్ర‌సాదం నీటిని స్వీక‌రించేందుకు మ‌రింత సుర‌క్షిత‌మైన తాగునీరు అందించేందుకు చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు తెలిపారు. రాబోవు సంక్రాంతి నుండి తిరుమ‌ల‌లో ప్లాస్టిక్ బాటిళ్ళు, బ్యాగులు నిషేధించ‌నున్న‌ట్లు తెలిపారు.

అదేవిధంగా శుక్రవారం ఉద‌యం జ‌రిగిన హెచ్‌డిపిపి స‌మావేశంలో స‌నాత‌న ధ‌ర్మ ప్ర‌చారానికి వేద పాఠ‌శాల‌లు, వేద పారాయ‌ణంను ఉప‌యోగించుకోనున్న‌ట్లు తెలిపారు. శ్రీ‌వాణి ట్ర‌స్టు ద్వారా ద‌ళిత‌వాడ‌ల‌లో ఆల‌యాలు నిర్మించ‌డం, శ్రీ‌నివాస క‌ల్యాణాలు నిర్వ‌హిస్తామ‌న్నారు. అదేవిధంగా ఆంధ్ర‌, తెలంగాణ రాష్ట్రాల‌లో ఉన్న గ్రామీణ ప్రాంతాల‌లోని పాఠ‌శాల విద్యార్థుల‌కు సుల‌భంగా అర్థ‌మ‌య్యేలా ఎన్‌జివోల స‌హ‌కారంతో త‌క్కువ ఖ‌ర్చుతో ఆధ్యాత్మిక పుస్త‌కాల‌ను పంపిణీ చేయ‌నున్న‌ట్లు తెలిపారు.  త‌ద్వారా చిన్న‌త‌నం నుండి విద్యార్థుల‌కు స‌నాత‌న హైంద‌వ‌ ధ‌ర్మాన్ని తెలియ‌జేయ‌వ‌చ్చ‌న్నారు. శ్రీ‌వారి వైభ‌వోత్స‌వాలు దేశ వ్యాప్తంగా ఉన్న న‌గ‌రాలు, జిల్లా కేంద్రాలు, పుణ్య‌క్షేత్రాలు, టిటిడి ఆల‌యాలు ఉన్న ప్రాంతాల‌లో నిర్వ‌హించేందుకు ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌మావేశంలో చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకోనున్న‌ట్లు వివ‌రించారు.  

ఈ కార్యక్రమంలో టిటిడి చీఫ్ ఇంజినీర్ శ్రీ రామచంద్రారెడ్డి, ఎస్ఇ ఎల‌క్ట్రిక‌ల్స్ శ్రీ వేంక‌టేశ్వ‌ర్లు, ఎస్‌ఇ-2 శ్రీ నాగేశ్వ‌ర‌రావు, ఇఇలు శ్రీ శ్రీ‌హ‌రి, శ్రీ మ‌ల్లికార్జున ప్ర‌సాద్, శ్రీ చంద్ర‌శేఖ‌ర్‌, ఇత‌ర అధికారులు  పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.