WATER LEVEL IN TIRUMALA RESERVOIRS RISES BY 61.68 LAKH GALLONS _ తిరుమల జలాశయాల్లో 61.68 లక్షల గ్యాలన్ల నీటి పెరుగుదల

Tirumala, 23 October 2026: The water levels in the five major reservoirs of Tirumala increased slightly 61.68 lakh gallons as of Friday morning.

While 21.60 lakh gallons of water was used, 40.08 lakh gallons remained as surplus.

Papavinasanam dam:

Increase of 20.96 lakh gallons; surplus of 6.86 lakh gallons

Gogarbham dam: Increase of 9.25 lakh gallons; surplus of 1.75 lakh gallons

Akashaganga dam: Increase of 6.33 lakh gallons; surplus of 6.33 lakh gallons

Kumaradhara dam: Increase of 25.14 lakh gallons; surplus of 25.14 lakh gallons

Pasupudhara dam: No change in water level.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER

తిరుమల జలాశయాల్లో 61.68 లక్షల గ్యాలన్ల నీటి పెరుగుదల

తిరుమల, 2026 అక్టోబర్ 23: తిరుమలలోని ఐదు ప్రధాన జలాశయాల్లో శుక్రవారం వరకు మొత్తం 61.68 లక్షల గ్యాలన్ల నీటి మట్టం పెరిగింది.

తిరుమలలో పాపవినాశనం, గోగర్భం, ఆకాశగంగ, కుమారధార, పసుపుధార జలాశయాలు ప్రధాన నీటి వనరులుగా ఉన్నాయి. శుక్రవారం ఉదయం నాటికి ఈ ఐదు జలాశయాల్లో కలిపి 21.60 లక్షల గ్యాలన్ల నీటిని వినియోగించగా, 40.08 లక్షల గ్యాలన్ల నీరు అదనంగా నిల్వ ఉంది.

జలాశయాల వారీగా నీటి నిల్వల వివరాలు ఇలా ఉన్నాయి.

1) పాపవినాశనం డ్యామ్

నిల్వ సామర్థ్యం: 5,240.00 లక్షల గ్యాలన్లు

గత రోజు నిల్వ: 2,667.39 లక్షల గ్యాలన్లు

ప్రస్తుత నిల్వ: 2,688.35 లక్షల గ్యాలన్లు

పెరిగిన నీరు: 20.96 లక్షల గ్యాలన్లు

వినియోగం: 14.10 లక్షల గ్యాలన్లు

మిగులు నీరు: 6.86 లక్షల గ్యాలన్లు

2) గోగర్భం డ్యామ్

నిల్వ సామర్థ్యం: 2,833.10 లక్షల గ్యాలన్లు

గత రోజు నిల్వ: 499.06 లక్షల గ్యాలన్లు

ప్రస్తుత నిల్వ: 508.31 లక్షల గ్యాలన్లు

పెరిగిన నీరు: 9.25 లక్షల గ్యాలన్లు

వినియోగం: 7.50 లక్షల గ్యాలన్లు

మిగులు నీరు: 1.75 లక్షల గ్యాలన్లు

3) ఆకాశగంగ డ్యామ్

నిల్వ సామర్థ్యం: 685.00 లక్షల గ్యాలన్లు

గత రోజు నిల్వ: 24.07 లక్షల గ్యాలన్లు

ప్రస్తుత నిల్వ: 30.40 లక్షల గ్యాలన్లు

పెరిగిన నీరు: 6.33 లక్షల గ్యాలన్లు

వినియోగం: 0.00 లక్షల గ్యాలన్లు

మిగులు నీరు: 6.33 లక్షల గ్యాలన్లు

4) కుమారధార డ్యామ్

నిల్వ సామర్థ్యం: 4,259.01 లక్షల గ్యాలన్లు

గత రోజు నిల్వ: 338.84 లక్షల గ్యాలన్లు

ప్రస్తుత నిల్వ: 363.98 లక్షల గ్యాలన్లు

పెరిగిన నీరు: 25.14 లక్షల గ్యాలన్లు

వినియోగం: 0.00 లక్షల గ్యాలన్లు

మిగులు నీరు: 25.14 లక్షల గ్యాలన్లు

5) పసుపుధార డ్యామ్

నిల్వ సామర్థ్యం: 1,287.54 లక్షల గ్యాలన్లు

గత రోజు నిల్వ: 24.38 లక్షల గ్యాలన్లు

ప్రస్తుత నిల్వ: 24.38 లక్షల గ్యాలన్లు

పెరిగిన నీరు: 0.00 లక్షల గ్యాలన్లు

వినియోగం: 0.00 లక్షల గ్యాలన్లు

మిగులు నీరు: 0.00 లక్షల గ్యాలన్లు

మొత్తంగా ఐదు జలాశయాల్లో 61.68 లక్షల గ్యాలన్ల నీరు పెరగ్గా, 21.60 లక్షల గ్యాలన్ల నీరు వినియోగమైంది. ప్రస్తుతం 40.08 లక్షల గ్యాలన్ల నీరు మిగులుగా ఉంది. ఆకాశగంగ డ్యామ్ పరిధిలో 8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సమయంలో 7.02 లక్షల గ్యాలన్లు, నవరాత్రి బ్రహ్మోత్సవాల సమయంలో 148.48 లక్షల గ్యాలన్ల నీరు అదనంగా చేరింది. అక్టోబర్ 23వ తేదీ వరకు మొత్తం 244.46 లక్షల గ్యాలన్ల నీరు అదనంగా చేరింది.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.