WE WELCOME DEVOTEES OF OTHER RELIGIOUS FAITH TO HINDUISM-TTD CHAIRMAN _ హిందూ ధర్మంలోకి ఇతర మతస్తులకు స్వాగతం- ⁠టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ భూమన కరుణాకర రెడ్డి

TIRUMALA, 04 FEBRUARY 2024: Hindu Sanatana Dharma is the oldest religious faith in the world which guides the human to lead a righteous way of life and free himself from the cycle of birth and death (Vimukti). We welcome persons from other religious faiths who voluntarily come forward to practice the Hindu way of life, said TTD Trust Board Chairman Sri Bhumana Karunakara Reddy.

 

During his concluding remarks in the morning session of Dharmika Sadas on Sunday, he said, as part of its chief mission to protect and propagate Hindu Sanatana Dharma, TTD will establish a system for proper initiation in to Hindu religion at Tirumala.

 

He said the devotees from other faiths and religions who voluntarily come forward to the Hindu way of life, will be trained in Hindu rituals, traditions and practices that were taught in Hindu Sanatana Dharma and this programme will be initiated at the Lotus Feet of Sri Venkateswara Swamy in Tirumala, he asserted amidst grand applause from the Pontiffs who participated in the Dharmika Sadas.

 

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

హిందూ ధర్మంలోకి ఇతర మతస్తులకు స్వాగతం

•⁠ ⁠టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ భూమన కరుణాకర రెడ్డి

తిరుమల, 2024 ఫిబ్రవరి 04: మానవులు ధర్మబద్ధంగా జీవించాలని తెలిపే హిందూ సనాతన ధర్మం ప్రపంచంలోనే అతి ప్రాచీనమైన మత విశ్వాసమని, ఈ ధర్మాన్ని ఆచరించేందుకు తమకు తాముగా, స్వచ్ఛందంగా ముందుకు వచ్చే ఇతర మతాలకు చెందిన వారిని స్వాగతిస్తున్నామని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ భూమన కరుణాకరరెడ్డి తెలిపారు.

ఆదివారం ఉదయం జరిగిన ధార్మిక సదస్సులో ఛైర్మన్ మాట్లాడుతూ సనాతన హిందూ ధర్మాన్ని వ్యాప్తి చేయడంలో భాగంగా హిందూ ధర్మం పట్ల అపారమైన గౌరవం, విశ్వాసం గల ఇతర మతాల వారిని ఆహ్వానించేందుకు తిరుమలలో తగిన ఏర్పాట్లు చేయాలని టీటీడీ యోచిస్తున్నట్లు చెప్పారు. ఇతర మతాల భక్తులు స్వచ్ఛందంగా ముందుకు వస్తే శ్రీ వేంకటేశ్వరస్వామివారి పాదకమలాల వద్ద హిందూ ఆచారాలు, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలపై శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. ధార్మిక సదస్సులో పాల్గొన్న పీఠాధిపతులందరూ ఈ విషయాలను అభినందించారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.