WEBSITE LAUNCHED WITH LATEST UPDATES ON LOCAL TEMPLES _ టీటీడీ ఆలయాల స‌మాచారంతో ఆధునీకరించిన వెబ్‌సైట్ ప్రారంభం

Tirupati, 08 January 2024:  TTD Chairman Sri Bhumana Karunakara Reddy launched a revamped website ttdevasthanams.ap.gov.in with an objective to give extensive publicity to TTD temples in Tirupati and other locations across the country.

The website launch program was held at the Mahati Auditorium on Monday.

The revamped website provided updates on local temple history, Arjita Sevas, Darshan hours, transport and other infrastructure available at over 60 TTD-managed temples and Information Centres across the country.

The portal also provided photos, videos and other geographical details with the technical support from Jio and the Configurations made by the TTD IT department.

TTD EO Sri AV Dharma Reddy, JEOs Smt Sada Bhargavi, Sri Veerabrahmam, CVSO Sri Narasimha Kishore DLO Sri Veeraju, CE Sri Nageswara Rao, IT Manager Sri LM Sandeep and others were present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

టీటీడీ ఆలయాల స‌మాచారంతో ఆధునీకరించిన వెబ్‌సైట్ ప్రారంభం

తిరుప‌తి, 2024 జనవరి 08: తిరుప‌తి, ఇత‌ర ప్రాంతాల్లో గ‌ల టీటీడీ స్థానికాల‌యాలు, అనుబంధ‌ ఆల‌యాలకు విస్తృత ప్రాచుర్యం క‌ల్పించేదిశ‌గా అన్ని వివ‌రాల‌తో ఆధునీకరించిన వెబ్‌సైట్‌ ttdevasthanams.ap.gov.in ను టీటీడీ ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకరరెడ్డి ప్రారంభించారు. తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో సోమవారం ఈ కార్యక్రమం జరిగింది.

టీటీడీలో 60కి పైగా ఉన్న స్థానికాల‌యాలు, అనుబంధ‌ ఆల‌యాలకు సంబంధించిన స్థ‌ల‌పురాణం, ఆర్జిత‌సేవ‌లు, ద‌ర్శ‌న వేళ‌లు, రవాణా వివరాలు, ఇత‌ర సౌక‌ర్యాల‌ను పొందుపరిచారు. ఆలయ విశిష్టతపై ఫొటోలు, వీడియోలను అందుబాటులో ఉంచారు. జియో సంస్థ సహకారంతో టీటీడీ ఐటీ విభాగం ఈ వెబ్‌సైట్‌ ను ఆధునీకరించింది.

ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, జేఈవోలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్ఓ శ్రీ నరసింహ కిషోర్, డిఎల్వో శ్రీ వీర్రాజు, సిఈ శ్రీ నాగేశ్వరరావు, ఐటి జనరల్ మేనేజర్ శ్రీ ఎల్ఎం.సందీప్ పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.