WORLD BLOOD DONORS DAY OBSERVED _ ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా అశ్విని హాస్పిటల్ లో రక్తదాన శిబిరం

TIRUMALA, 14 JUNE 2023: In connection with World Blood Donors Day, a blood donation camp was organised at Aswini Hospital in Tirumala on Wednesday.

According to the Hospital Civil Surgeon Dr S Kusuma Kumari, every year on June 14 World Blood Donors Day is being observed across the world since 2004.

 

She said this year theme is, Give blood, give plasma, share life, share often. Blood is an invaluable contribution that one individual can offer to another, to rescue a life, or perhaps multiple lives.

 

The Civil Surgeon also said a total of 24 donors have come forward and donated blood on Wednesday in Tirumala Aswini Hospital.

 

Deputy Civil Surgeons Dr Padmaja, Dr Kalyani, Dr Subba Reddy and other para-medical staff were also present.

 
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా అశ్విని హాస్పిటల్ లో రక్తదాన శిబిరం

తిరుమల, 2023 జూన్ 14: ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం తిరుమలలోని అశ్విని ఆసుపత్రిలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.

అశ్విని ఆసుపత్రి సివిల్ సర్జన్ డాక్టర్ ఎస్ కుసుమ కుమారి ఈ సందర్బంగా మాట్లాడుతూ 2004 నుండి ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం జూన్ 14న ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారన్నారు.

రక్తాన్ని ఇవ్వండి, ప్లాస్మా ఇవ్వండి, జీవితాన్ని పంచుకోండి అనేది ఈ సంవత్సరం అంశం అని ఆమె చెప్పారు. రక్తం అనేది ఒక వ్యక్తి మరొకరికి అందించగల అమూల్యమైన సహకారమని, ఒక జీవితాన్ని లేదా బహుళ జీవితాలను రక్షించడానికి రక్త దానం ఎంతో ముఖ్యమని ఆమె తెలిపారు.

తిరుమల అశ్విని ఆసుపత్రిలో బుధవారం నాడు మొత్తం 24 మంది దాతలు ముందుకు వచ్చి రక్తదానం చేసినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ సివిల్ సర్జన్లు డాక్టర్ పద్మజ, డాక్టర్ కళ్యాణి, డాక్టర్ సుబ్బారెడ్డి, ఇతర పారా మెడికల్ సిబ్బంది పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది