YOGA PROMOTES MENTAL AND PHYSICAL HEALTH-JEO_ యోగాతో శారీర‌క‌, మాన‌సిక వికాసం : టిటిడి తిరుప‌తి జెఈవో శ్రీ బి.ల‌క్ష్మీకాంతం

Tirupati, 21 June 2019: Stay fit physically and mentally with Yoga, said TTD Joint Executive Officer for Tirupati Sri B Lakshmikantham.

Participating in the International Yoga Day celebrations at Mahati Auditorium on Friday evening the JEO exhorted TTD employees on a health awareness campaign.

Speaking on the occasion the jeo said yoga was a pure bouquet of physical exercise and a sure path for spiritual enhancement. He said balanced diet, daily consumption of 4 litres of water, walk for three kms and frequent blood checks every two or three months keeps body fit, he asserted. Only healthy TTD workers will be able to provide quality services to devotees, he added.

Later on yoga exponent, Sri Vasudev Reddy gave several suggestions for healthy living and also demonstrated some Yogasanas. Dietician Maharshi also gave some important health tips on the occasion.

TTD Chief medical officer Dr Nageswar Rao, VGO Sri Ashok Kumar Goud,.DEO Sri M Ramachandra, DyEOs Smt Snehalata, Sri EC Sridhar, Yoga instructor Sri N Jagadekapratap, TTD employees and their families participated.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

యోగాతో శారీర‌క‌, మాన‌సిక వికాసం : టిటిడి తిరుప‌తి జెఈవో శ్రీ బి.ల‌క్ష్మీకాంతం

తిరుపతి, 2019 జూన్ 21: యోగా సాధ‌న చేయ‌డం ద్వారా శారీర‌క‌, మాన‌సిక వికాసం క‌లుగుతుంద‌ని, ప్ర‌తి ఒక్క‌రూ త‌మ దైనందిన జీవితంలో యోగాను అల‌వాటు చేసుకోవాల‌ని టిటిడి తిరుప‌తి జెఈవో శ్రీ బి.ల‌క్ష్మీకాంతం తెలియ‌జేశారు. అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వం సంద‌ర్భంగా తిరుప‌తిలోని మ‌హ‌తి క‌ళాక్షేత్రంలో శుక్ర‌వారం టిటిడి ఉద్యోగుల‌కు ఆరోగ్య నియ‌మాల‌పై అవ‌గాహ‌న కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా జెఈవో మాట్లాడుతూ యోగా అంటే వ్యాయామ సాధనల సమాహారం అని, ఇది ఆధ్యాత్మిక సాధనకు చక్కగా తోడ్పడుతుంద‌ని అన్నారు. యోగాకు సాధన అని, అదృష్టమని అర్థాలున్నాయ‌ని చెప్పారు. భగవద్గీతలో అధ్యాయాలకు యోగములని పేర్లు ఉన్న‌ట్టు తెలిపారు. వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు, రామాయణం, భాగవతం, భారతం, భగవద్గీతలలో యోగా ప్రస్తావన ఉందని, పతంజలి వీటిని పతంజలి యోగసూత్రాలుగా క్రోడీకరించార‌ని వివ‌రించారు. ప్ర‌తి ఒక్క‌రూ సాత్వికాహారం తీసుకోవాల‌ని, ఉప్పు, తీపి, కారం త‌గ్గించాల‌ని సూచించారు. తీగ జాతి కూర‌గాయ‌ల‌ను తీసుకుంటే ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంద‌న్నారు. రోజుకు నాలుగు లీట‌ర్లు నీరు తాగాల‌ని, రాగి, స‌జ్జ‌, జొన్న లాంటి ధాన్యాల‌తో చేసి వంట‌కాల‌ను భుజిస్తే శారీర‌క బ‌లం చేకూరుతుంద‌ని వెల్ల‌డించారు. ప్ర‌తి ఒక్క‌రూ రోజుకు 3 కి.మీ న‌డ‌క సాగించాల‌ని, త‌రచుగా ర‌క్త‌ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని సూచించారు. టిటిడి ఉద్యోగులు ఆరోగ్య‌వంతంగా ఉన్నప్పుడే భ‌క్తులకు మ‌రింత మెరుగైన సేవ‌లు అందించ‌గ‌ల‌ర‌ని అన్నారు.

అనంత‌రం ప్ర‌ముఖ యోగా నిపుణులు శ్రీ వాసుదేవ‌రెడ్డి యోగ నియ‌మాల‌ను తెలియ‌జేశారు. ప‌లు యోగాస‌నాల‌ను చేయించారు. ఆహార నియ‌మాల‌పై శ్రీ సాగ‌ర్ ఉద్యోగుల‌కు త‌గు సూచ‌న‌లు చేశారు. టిటిడి ఎపిఆర్వో కుమారి పి.నీలిమ వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించారు.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి ముఖ్య వైద్యాధికారి డా|| నాగేశ్వరరావు, విజివో శ్రీ అశోక్‌కుమార్ గౌడ్‌, డిఇవో శ్రీ ఎం.రామ‌చంద్ర‌, డెప్యూటీ ఈవోలు శ్రీ‌మ‌తి స్నేహ‌ల‌త‌, శ్రీ ఇసి.శ్రీ‌ధ‌ర్‌, యోగ ఇన్‌స్ట్ర‌క్ట‌ర్ శ్రీ ఎన్‌.జ‌గ‌దేక‌ప్ర‌తాప్‌, టిటిడి ఉద్యోగులు, వారి కుటుంబ స‌భ్యులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.