YOGA NARAYANA SHINES ON SIMHA VAHANAM_ సింహ వాహనంపై యోగ నరసింహుడి అవతారంలో శ్రీ మలయప్ప

Tirumala, 15 September 2018: On the third day of the ongoing annual Brahmotsvams on Saturday morning, Sri Malayappa Swamy donned Yoga Narayana and enthralled the devotees with a celestial ride on the ferocious Simha Vahanam.

The sacred Simha vahanam with the Lord riding on a Lion with a sitting posture of “Yoga Narayanamurthy” the icon of Gnana and Bhakti themes fascinated the scores of devotees who thronged Tirumala.

Lion is a symbol of royalty and power. Lord assumed the form of half man and half lion in his Narasimha Avathara. Lord Sri Krishna says in Bhagavath Geetha that he is the Lion among the animals.

The devotees occupied every inch of Mada streets to catch a glimpse of Lord on Simha Vahanam and were captivated by His divine charm.

According to the theology of Vaishnavism, Narasiṁhavataram indicated the omnipresence of God and his ever readiness to come to the aid of His devotees, no matter how difficult or impossible the circumstances may appear to be, in all situations if they sincerely pray Him.

TTD Chairman Sri P Sudhakar Yadav, EO Sri Anil Kumar Singhal, JEO Sri KS Sreenivasa Raju, TTD Board Member Smt Sudha Narayanamurthy, Addl CVSO Sri Sivakumar Reddy, VGO Sri Raveendra Reddy, Temple DyEO Sri Haridranath, Peishkars Sri Ramesh, Sri Nagaraj and others were also present.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

సింహ వాహనంపై యోగ నరసింహుడి అవతారంలో శ్రీ మలయప్ప

సెప్టెంబరు 15, తిరుమల 2018: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన శనివారం ఉదయం అనంతతేజోమూర్తి అయిన శ్రీ మలయప్ప సింహ వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు.

శ్రీవారు మూడో రోజు ఉదయం దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం సింహంపై కూర్చొని ఊరేగుతారు. సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతం. ఉదయం నిద్ర లేవగానే దర్శించే వస్తువుల్లో ‘సింహదర్శనం’ అతి ముఖ్యమయింది. సింహ రూప దర్శనంతో పైన పేర్కొన్న శక్తులన్నీ చైతన్యవంతాలవుతాయి. సోమరితనం నశించి పట్టుదలతో ప్రవర్తించి సర్వత్రా విజయులమై ఆధిపత్యంతో రాణించే స్ఫూర్తి సిద్ధిస్తుంది. అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను హరించడంలో నేను, నా వాహనమైన సింహమూ సమాన ప్రయత్నంతో ఉంటామని ఈ సింహ వాహనోత్సవం ద్వారా శ్రీవారు నిరూపిస్తున్నారు.

కాగా, మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు స్నపనతిరుమంజనం, సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరగనుంది. రాత్రి 8 నుండి 10 గంటల వరకు ముత్యపుపందిరి వాహనంపై శ్రీవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.

ముత్యాల నిర్మలకాంతులు వ్యాపించడానికి, ఆ కాంతులు దర్శించి భక్తులు ముక్తులు కావడానికి రాత్రి వేళ అనుకూలం. అందుకే శ్రీమలయప్పకి మూడో రోజు రాత్రి మొదటియామంలో ముత్యాల పందిరిలో కూర్చొని విహరించే కైంకర్యాన్ని పెద్దలు నిర్ణయించారు. ముత్యం స్వచ్ఛతకు సంకేతం. మనిషి ఆత్మ ఎన్నో జన్మల అనంతరం విశ్వలోకాల నుండి రాలి, దుర్లభమైన మానవజన్మను సంతరించుకుంటుంది. శరీరాన్ని ఆధ్యాత్మిక సంపదతో శుద్ధి చేసుకుంటే బుద్ధి ముత్యంలాగా మారి, జనన, మరణ చక్రం నుండి విడుదలై మోక్షాన్ని పొందుతుంది. ఇలా స్వామివారికి మిక్కిలి ప్రీతిపాత్రమైన ముత్యాలహారాలు – రత్నాల వల్ల కలిగే వేడిమినీ, పుష్పాల వల్ల కలిగే సుగంధాన్ని తమలో ఇముడ్చుకుని, స్వామివారి వక్షఃస్థలానికి, అక్కడి లక్ష్మీదేవికి సమశీతోష్ణస్థితిని చేకూరుస్తూ, తాపగుణాన్ని హరిస్తూ, ఉత్సాహాన్ని, ప్రశాంతతను చేకూరుస్తున్నాయి.

ఈ కార్యక్రమంలో టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పుట్టా సుధాకర్‌ యాదవ్‌, కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు, బోర్డు సభ్యులు శ్రీ మేడా రామకృష్ణారెడ్డి, ప్రత్యేక ఆహ్వానితులు శ్రీ రాఘవేంద్రరావు ఇతర అధికారులు పాల్గొన్నారు. కాగా, బ్రహ్మోత్సవాలలో నాలుగో రోజైన ఆదివారం ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి సర్వభూపాల వాహనంపై శ్రీవారు ఊరేగి భక్తులను కటాక్షిస్తారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.