YOUTH MUST LEARN TIME MANAGEMENT FROM HANUMAN _ హ‌నుమంతుని జీవ‌నం – స‌మ‌య పాల‌న‌కు అద్దం ప‌డుతుంది : డాక్టర్ ఆకెళ్ల విభీషణ శర్మ

Tirumala, 5 Jun. 21: The youth of today should learn the time management technique from the lifestyle of Sri Anjaneya Swamy to achieve their goals and aspirations said Dr A Vibhishana Sharma, Project Officer SV higher Vedic studies.

Speaking on “Hanuman Time management skills to Youth” on Nada Neerajanam platform at Tirumala on Saturday as a part of the ongoing Hanumad Vaibhavam Pravachanam program, he said along with Mind, Power, Strength, Hanuman perfectly followed Time Management and successfully traced Sita Devi. Today youth should also follow the ideals of Hanuman if they want to achieve newer heights in their lives, he maintained.

AT AKASA GANGA

On day two, the presiding deities of Anjana Devi and Hanuman were rendered abhishekam and special poojas at Anjanadri in Tirumala near Akasa Ganga.

The Annamacharya Project artistes performed sankeertans while at Japali, Dasa Sahitya Project artistes rendered Hanuman Chalisa.

Additional EO Sri AV Dharma Reddy and other officials were present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

హ‌నుమంతుని జీవ‌నం – స‌మ‌య పాల‌న‌కు అద్దం ప‌డుతుంది : డాక్టర్ ఆకెళ్ల విభీషణ శర్మ

తిరుమల, 2021 జూన్ 05: ఆంజ‌నేయ‌స్వామివారి జీవ‌న విధానం స‌మ‌య పాల‌న‌కు అద్దం ప‌డుతుంద‌ని, నేటి యువ‌త ఆయ‌న ఆడుగుజాడ‌ల్లో న‌డిచి కాల‌న్ని చ‌క్క‌గా వినియోగించుకుంటే ఉన్న‌త శిఖ‌రాల‌ను అధిరోహించ‌వ‌చ్చ‌ని ఎస్వీ ఉన్న‌త వేద అధ్య‌య‌న‌ సంస్థ ప్రాజెక్టు అధికారి డాక్టర్ ఆకెళ్ల విభీషణ శర్మ ఉద్ఘాటించారు. తిరుమ‌ల‌లో హ‌నుమ‌జ్జ‌యంతి ఉత్స‌వాల్లో భాగంగా రెండ‌వ‌ రోజైన శ‌నివారం మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు నాద‌నీరాజ‌నం వేదిక‌పై ” నేటి యువతకు ఆదర్శం హనుమ ” అనే అంశంపై ప్ర‌వ‌చన‌ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఉప‌న్య‌సిస్తూ నేటి యువ‌త సోమ‌రిత‌నం, మాన‌సిక ఆందోళ‌న‌, వ్య‌స‌నాల వ‌ల‌న కాలాన్ని వృధా చేయ‌కుడ‌ద‌న్నారు. గ‌తించిన జ‌లాన్ని తిరిగి ఎలా పొంద‌లేమో అదేవిధంగా ముగిసిన కాలాన్ని కూడా తిరిగి అందుకోలేమ‌న్నారు. ఆంజ‌నేయ‌స్వామివారి జీవితంలో దైర్యం, ఆలోచ‌న శ‌క్తి, వివేకం, సంయ‌మ‌నం ప్ర‌ధానంగా క‌నిపిస్తాయ‌ని, యువ‌త ఈ ల‌క్ష‌ణాల‌ను పుణికి పుచ్చుకుంటే వారి అభివృద్ధికి ఆకాశ‌మే హ‌ద్ధుగా నిలుస్తుంద‌ని తెలిపారు. యువ‌త మ‌న‌స్సు, వాక్కు, క‌ర్మల‌ను నిరంత‌రం స‌మీక్షించుకోవాల‌న్నారు.

హ‌నుమంతుడు సుగ్రీవున‌కు మంత్రిగా, శ్రీ‌రామ‌చంద్రామూర్తికి దూత‌గా, సీత‌మ్మ‌వారికి ఓదార్పు ప‌లికాడ‌న్నారు. అలాగే యుద్ధంలో నైపుణ్యాన్ని ప్ర‌ద‌ర్శించిన అద‌ర్శ‌వంతంగా నిలిచార‌న్నారు. యువ‌త ఆంజ‌నేయ‌స్వామివారి నిష్కామ‌ క‌ర్మ‌ను, ఆరోగ్య క‌ర‌మైన జీవ‌న విధానాన్ని నిరంత‌రం అవ‌లంబించాల‌న్నారు. త‌ద్వారా యువ‌త సాధించే విజ‌యాలు లోకంలో ఆద‌ర్శ‌వంతంగా నిలుస్తాయ‌ని వివ‌రించారు.

ఆకాశ‌గంగ –

ఆకాశ‌గంగ వ‌ద్ద టిటిడి నిర్వ‌హిస్తున్న హ‌నుమ‌జ్జ‌యంతి ఉత్స‌వాల్లో భాగంగా రెండ‌వ రోజైన శ‌నివారం ఉద‌యం 8.30 గంట‌ల‌కు అంజ‌నాదేవి, బాల ఆంజ‌నేయ‌స్వామివారికి విశేష అభిషేకం, త‌మ‌ల‌పాకుల‌తో పూజ‌, అర్చ‌న నిర్వ‌హించారు.

ఈ పూజా కార్య‌క్ర‌మంలో టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి, శ్రీ‌వారి ఆల‌య ఒఎస్‌డి శ్రీ పాల శేషాద్రి, ప్ర‌ముఖ పండితులు మ‌రియు టిటిడి వైఖాన‌స ఆగ‌మ స‌ల‌హాదారు శ్రీ మోహ‌నరంగాచార్యులు, విజివో శ్రీ బాలిరెడ్డి, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

అనంత‌రం అన్న‌మాచార్య ప్రాజెక్టు సంచాల‌కులు ఆచార్య ద‌క్షిణామూర్తి శ‌ర్మ ఆధ్వ‌ర్యంలో అన్న‌మాచార్య ప్రాజెక్టు క‌ళాకారిణి శ్రీ‌మ‌తి బుల్లెమ్మ బృందం ఆంజ‌నేయ‌స్వామివారిపై సంకీర్త‌న‌ల‌ను ఆల‌పించారు.

జాపాలి –

జాపాలి క్షేత్రంలో టిటిడి దాస‌సాహిత్య ప్రాజెక్టు ప్ర‌త్యేకాధికారి శ్రీ పి.ఆర్‌.ఆనంద తీర్థాచార్యులు ఆధ్వ‌ర్యంలో క‌ళాకారులు ఉద‌యం 10 నుంచి 11 గంటల వరకు హనుమాన్ చాలీసా ప‌ఠించారు. త‌రువాత అన్న‌మాచార్య ప్రాజెక్టు క‌ళాకారులు శ్రీ ర‌ఘునాధ్ బృందం హ‌నుమ‌త్ స‌కీర్త‌న కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.