YOUTH SHOULD BE ENLIGHTENED ON ARSHA VIGNANA- TTD ADDITIONAL EO _ నేటి యువ‌త‌కు ఆర్ష‌ సంప‌ద అందించాలి : అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి

FOLLOW DHARMA THROW OUT CORONA

 RAVANA SAMHARAM FROM YUDDHAKANDA RECITED

 SETTINGS STEAL THE SHOW

TIRUMALA, 06 JULY 2021: With the day to diminishing human values in the society, there is an urgent need to enlighten our youth on the great ethics embedded in Arsha Dharma, strongly opined the Additional EO Sri AV Dharma Reddy.

Speaking to media after Ravana Samharam from Yuddhakanda episode recitation was completed at Vasantha Mandapam on Tuesday, he said Sri Mahavishnu took the human incarnation of Sri Rama to show the world that when Dharma is followed evil cannot survive. All His life Sri Rama followed Dharma and killed the powerful demon king Ravana. “Similarly all of us, if we follow our Dharma, we can get rid of Corona”‘ he maintained.

Later he appreciated the efforts of Pundits, SVBC and Garden wings for successfully taking forward the programme. “On the last day of Bhagavat Gita, we will lay similar setting of Vishwaroopa Darshanam of Sri Krishna “, he added.

Dharmagiri Veda Vignana Peetham Principal Sri KSS Avadhani who led the massive recitation programme said, since June 11 onwards the Yuddhakanda shlokas are being recited. Today in Ravana Samharam, 270shlokas from 109 to 114 sargas have been recited. The 111 chapter consists of Rama killing Ravana.

The Annamacharya Project artists rendered songs relevant to the situation while the Ashoka Vanam settings erected matching the occasion caught everyone’s attention.

Sri Rama with Panchayudhas was seated on Hanuman while Lakshmana Swamy on Aswa Vahana and Sita Devi and Anjaneya also seated separately.

The setting of war between Rama-Ravana stood as a special attraction. By offering Nakshatra and Kumbha Harati the event completed which was telecasted live on SVBC for over three hours starting from 8:30am onwards for the sake of global devotees.

Pradhana Archakas Sri Venugopala Deekshitulu, Sri Krishna Seshachala Deekshitulu, OSD Seshadri, Sri Kiran Swamy, CEO SVBC Sri Suresh Kumar, DyEO Sri Vijayasaradhi, Annamacharya Project Director Sri Dakshinamurthy Sharma, Higher Vedic Studies Project Officer Dr A Vibhishana Sharma and others were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

నేటి యువ‌త‌కు ఆర్ష‌ సంప‌ద అందించాలి : అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి

– శ్రీ‌రామ విజ‌యోత్స‌వ సంకీర్త‌న‌ల‌తో మార్మోగిన వ‌సంత మండ‌పం

– శ్రీ‌రామ రావ‌ణ యుద్ధం స‌ర్గ‌ల పారాయ‌ణం

తిరుమ‌ల‌, 2021 జూలై 06: నేడు మ‌నం మ‌ర్చి పోతున్న ఆర్ష‌ సంప‌ద‌లైన రామాయ‌ణం, మ‌హా భార‌తం, భాగ‌వ‌తం, ఉప‌నిష‌త్తులు, అష్టాద‌శ పురాణాలను యువ‌త‌కు అందించేందుకు టిటిడి ఇటువంటి ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్న‌ట్లు అద‌న‌పు ఈవో శ్రీ ఎ.వి.ధ‌ర్మారెడ్డి ఉద్ఘాటించారు. తిరుమ‌ల‌లోని వ‌సంత మండ‌పంలో మంగ‌ళ‌వారం రామాయ‌ణంలోని యుద్ధ‌కాండ రావ‌ణ సంహారం స‌ర్గ‌ల పారాయ‌ణ కార్య‌క్ర‌మంలో ఆయ‌న పాల్గొన్నారు.

ఈ సంద‌ర్బంగా అద‌న‌పు ఈవో మాట్లాడుతూ ధ‌ర్మాన్ని ఆచ‌రించే వారిని ధ‌ర్మ‌మే కాపాడుతుంద‌నే విష‌యం రామాయ‌ణం మ‌న‌కు తెలుపుతున్న‌ద‌న్నారు. అటువంటి ధ‌ర్మాన్ని శ్రీ‌రాముడు ఆచ‌రించ‌టం వ‌ల‌న బ‌ల‌వంతుడైన రావ‌ణుడు నాశ‌న‌మైన‌ట్లు చెప్పారు. కావున చెడుపై మంచి ఏప్పుడూ విజ‌యం సాధిస్తుంద‌ని రామాయ‌ణం ద్వారా తెలుస్తున్న‌ద‌న్నారు. ఏవిధంగానైతే దుష్ట రావ‌ణుడి సంహారం ఈ రోజు అత్య‌ద్భుతంగా పండితుల చేత యుద్ధ‌కాండ పారాయ‌ణం ద్వారా జ‌రిగిందో, అదేవిదంగా ప్ర‌పంచ దేశాల‌ను ప‌ట్టి పీడిస్తున్న క‌రోనా మ‌హ‌మ్మ‌రి కూడా త్వ‌ర‌లో అంత‌మై పోతుంద‌నే ఆశా భావాన్ని వ్య‌క్తం చేశారు. ధ‌ర్మాన్ని ఆచ‌రించండి క‌రోనాను త‌రిమి కొటండి అనే సిద్ధాంతంతో ప్ర‌తి ఒక్క‌రు ధ‌ర్మ బ‌ద్ద‌మైన జీవ‌నాన్ని జీవిస్తూ శ్రీ‌వారి అనుగ్ర‌హ‌నికి పాత్రులు కావాల‌న్నారు.

ఇదేవిధంగా నాద‌నీరాజ‌నం వేదిపై శ్రీ భ‌గ‌వ‌ద్గీత పారాయ‌ణంలో చివ‌రి రోజు శ్రీ‌మ‌హా విష్ణువు విశ్వ‌రూప ద‌ర్శ‌నం అవిష్క‌రించి భ‌క్తుల‌కు అందిస్తామ‌ని చెప్పారు. ఈ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతంగా నిర్వ‌హించిన అధికారులు, వేద పండితుల‌ను ఆయ‌న ప్ర‌త్యేకంగా అభినందించారు.

అంత‌కుముందు ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్ శ్రీ కుప్పా శివ‌సుబ్ర‌మ‌ణ్య అవధాని మాట్లాడుతూ కరోనా వైరస్ నుంచి ప్రపంచానికి విముక్తి కల్పించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ జూన్ 11వ తేదీ నుండి తిరుమ‌లలోని వ‌సంత మండపంలో యుద్ధ‌కాండ పారాయ‌ణం నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు. ఇందులో భాగంగా మంగ‌ళ‌వారం రావ‌ణ సంహారంలో 109 నుండి 114 వ‌ర‌కు ఉన్న 270 శ్లోకాల‌ను పారాయ‌ణం చెసిన్న‌ట్లు చెప్పారు. ఇందులో 111వ స‌ర్గ 14వ శ్లోకంలో శ్రీ రామ‌చంద్ర‌మూర్తి రావ‌ణునిపై బాణం ఎక్కు పెట్ట‌డంతో ప్రారంభ‌మై, 19వ శ్లోకంలో వ‌ధించ‌డంతో పూర్త‌వుతుంద‌న్నారు. మాన‌వులుగా జ‌న్మించి రాక్ష‌స భావాల‌ను పొంద‌కూడ‌ద‌న్నారు. ప్ర‌తి రోజు రావ‌ణ సంహారం శ్లోకాలు పారాయ‌ణం చేయ‌డం వ‌ల‌న అష్టైశ్వ‌ర్యాలు క‌లిగి కుటుంబం అంతా సుఖ‌సంతోషాలు, ఆయురారోగ్యాల‌తో ఉంటార‌ని వివ‌రించారు.

అనంత‌రం రావ‌ణ సంహారం సంద‌ర్భంగా మ‌హిళ‌లు, వేద పండితులు, అర్చ‌కులు, అధికారులు స్వామివారికి ప్ర‌త్యేక మంగ‌ళ హ‌ర‌తులు స‌మ‌ర్పించారు.

ఆక‌ట్టుకున్న సెట్టింగులు :

టిటిడి గార్డెన్ విభాగం ఆధ్వ‌ర్యంలో అశోక‌వ‌నంలో సీత‌మ్మ‌వారు, ఆంజ‌నేయ‌స్వామివారి సెట్టింగ్‌ ఏర్పాటు చేశారు. రామ‌రావ‌ణ యుద్దం సంద‌ర్భంగా హ‌నుమంత వాహ‌నంపై క‌త్తి, గ‌ధ‌, విల్లు, ఈటే వంటి పంచ ఆయుధాలు, అస్త్ర‌లు ధ‌రించిన శ్రీ‌రామ‌చంద్ర‌మూర్తి, అశ్వ వాహ‌నంపై ల‌క్ష్మ‌ణ‌స్వామివారు, విల్లంబుల‌తో యుద్ధం చేస్తున్న ప‌ది త‌ల‌ల రావ‌ణుడు, యుద్ధ స‌న్నివేశాలతో ప్లెక్సీలు ఆక‌ట్టుకున్నాయి. అదేవిధంగా ప్ర‌వేశ ద్వారం ముందు విష్వ‌క్సేనుల‌వారు, ఆయుధాలు ధ‌రించిన ఆంజ‌నేయ‌స్వామివారి విగ్ర‌హ‌లు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి.

రామ విజ‌యోత్స‌వ కీర్త‌న‌ల‌తో పుల‌కించిన స‌ప్త‌గిరులు

ప‌ద‌క‌వితా పితామ‌హుడు శ్రీ తాళ్ళ‌పాక అన్న‌మాచార్యులవారు ర‌చించినశ్రీ‌రామ విజ‌య కీర్త‌న‌ల‌ను అన్న‌మాచార్య ప్రాజెక్టు క‌ళాకారులు శ్రీ మధుసూధ‌న‌రావు బృందం ” అనుచు రావ‌ణుసేన ల‌టు భ్ర‌మ‌యుచు……..” , ” ఎదురా ర‌ఘుప‌తికి నీ విటు రావ‌ణా ….. ” కీర్త‌న‌ల‌ను సుమ‌ధురంగా ఆల‌పించారు.

ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన సాంప్ర‌య‌దాయ వాయ్యిదాల‌తో పాటు ఢ‌మ‌రం, ట‌కోరా, జాల‌ర్లు వంటి ప్ర‌త్యేక వాయిద్యాల‌తో న‌గ‌భోతుగానంతో సంకీర్త‌న‌ల‌కు సంగీతాన్ని అందించారు.

ఈ కార్య‌క్ర‌మంలో సూళ్ళూరుపేట యం.ఎల్.ఏ శ్రీ సంజీవ‌య్య‌, ఎస్వీబీసి సిఈవో శ్రీ సురేష్‌కుమార్‌, శ్రీ‌వారి ఆల‌య ప్ర‌ధాన అర్చ‌కులు శ్రీ వేణుగోపాల దీక్షితులు, శ్రీ కృష్ణశేషాచ‌ల‌ దీక్షితులు, ఓఎస్‌డి శ్రీ పాల శేషాద్రి, అన్న‌మాచార్య ప్రాజెక్టు సంచాల‌కులు శ్రీ ద‌క్షిణామూర్తి శ‌ర్మ‌, డెప్యూటీ ఈవో (రెవెన్యూ మ‌రియు పంచాయ‌తి) శ్రీ విజ‌య‌సార‌థి, ఎస్వీ ఉన్న‌త వేద అధ్య‌య‌న‌ సంస్థ ప్రాజెక్టు అధికారి డాక్టర్ ఆకెళ్ల విభీషణ శర్మ, వేద పండితులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.