RATHOTSAVAM HELD _ వైభవంగా శ్రీ కోదండరామస్వామివారి రథోత్సవం
TIRUPATI, 06 APRIL 2022: On the penultimate day of the annual Brahmotsavam in Sri Kodanda Rama Swamy temple, Radhotsavam was observed on Wednesday.
The deities blessed devotees along Mada streets.
In the evening unjal Seva will be observed.
All temple staffs participated.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
వైభవంగా శ్రీ కోదండరామస్వామివారి రథోత్సవం
తిరుపతి, 2022 ఏప్రిల్ 06: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు బుధవారం ఉదయం రథోత్సవం వైభవంగా జరిగింది. ఉదయం 7.10 గంటలకు రథోత్సవం ప్రారంభమైంది. శ్రీ సీత లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారు రథాన్ని అధిరోహించి ఆలయ మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కళాబృందాల కోలాటాలు ఆకట్టుకున్నాయి.
ఆత్మ రథికుడు, శరీరమే రథం, బుద్ధి సారథి, మనస్సు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీధులు. ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చడంతో స్థూల శరీరం వేరని, ఆత్మ అందుకు భిన్నమనే ఆత్మానాత్మ వివేకం కలుగుతుంది. రథోత్సవంలో ముఖ్యంగా కలిగే తత్త్వజ్ఞానమిదే.
సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరగనుంది. రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకు అశ్వ వాహనంపై శ్రీ కోదండరామస్వామివారు భక్తులకు కనువిందు చేయనున్నారు.
వాహనసేవలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి పార్వతి, ఏఈవో శ్రీ దుర్గరాజు, కంకణబట్టార్ శ్రీ ఆనందకుమార్ దీక్షితులు, సూపరింటెండెంట్ శ్రీ రమేష్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ మునిరత్నం, శ్రీ జయకుమార్, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.