‘అంతా బంగారమేనా!’ అను వార్త వాస్తవం కాదు
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి.
వివరణ(తిరుపతి, నవంబర్-20,2009)
‘అంతా బంగారమేనా!’ అను వార్త వాస్తవం కాదు
నవంబర్ 20వ తేదిన ఈనాడు దినపత్రిక నందు ప్రచురించిన ‘అంతా బంగారమేనా!’ అను వార్త వాస్తవం కాదు.
సదరు వార్తనందు ఈమొత్తం వ్యవహారంలో కోట్లాది రూపాయలు చేతులు మారాయని, అక్రమాలు కూడా బాగా జరిగాయని కూడా వ్రాయడం సరికాదు.
ఆనందనిలయం అనంత స్వర్ణమయం పేరుతో శ్రీవారి ఆలయగోడలకు చేయు మొత్తం బంగారు తాపడం పని దాతలు ఇచ్చిన విరాళాలతోనే జరుగుచున్నది. బంగారు రూపంలో వచ్చిన విరాళాలు ఖజానా విభాగంలో భద్రపరచబడుతున్నవి. మరియు నగదు విరాళాలు తిరుమలలోని ఆంధ్రాబ్యాంకులో జమచేయబడుతున్నవి. ఇటువంటి పరిస్థితులలో ఎటువంటి అవినీతికి తావులేదని మనవి చేస్తున్నాము.
కనుక రేపటి మీ దినపత్రిక నందు ఈ విషయాన్ని వివరణగా ప్రచురించాల్సిందిగా కోరడమైనది.
ప్రజాసంబంధాల అధికారి
తిరుమల తిరుపతి దేవస్థానములు