TTD TO HOST SRINIVASA KALYANAM FETE AT UK, EUROPE FROM OCTOBER 15- NOVEMBER 13 _ అక్టోబరు 15 నుంచి నవంబరు 13 వరకు యుకె , యూరప్ దేశాల్లో శ్రీనివాస కల్యాణాలు
TTD CHAIRMAN UNVEILS SRINIVASA KALYANAM POSTERS
Tirumala, 23 September 2022: As part of its agenda for Sanatana Hindu Dharma Pracharam, TTD plans to conduct Srinivasa Kalyanam fete in UK and Europe countries from October 15-November 13.
Releasing the posters of the overseas fete on Friday night at Annamaiah Bhavan, TTD Chairman Sri YV Subba Reddy said the celebrations are being scheduled upon the directions of Honourable CM of AP to bring Hindus across the world closer to Sri Venkateswara.
Following the directions, TTD has conducted Srivari Kalyanams and Vaibhavotsavam at several locations in the country and also in US.
He said in June and July this year in coordination with Telugu associations and APNRTS, in US Srinivasa Kalyanam were conducted in Nine cities of USA. Similarly, in coordination with Telugu associations in UK and Europe, the celestial events will be performed there.
As per schedule Basing Stoke (UK) on October 15, Manchester on October 16, Belfast in Northern Ireland on October 22, Dublin on October 23.
Similarly on October 29 at Zurich, Switzerland, Europe, on October 30 at Amsterdam in Netherlands, November 5 at Frankfurt in Germany, in Paris in France on November 6, at London on November 12, at Edinburg in Scotland of UK on November 13.
TTD board members Sri Rambhupal Reddy, Sri Nanda Kumar, APNRTS president Sri.MedaPati Venkat, UK Telugu Association President Sri Killi Satya Prasad were present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
అక్టోబరు 15 నుంచి నవంబరు 13 వరకు యుకె , యూరప్ దేశాల్లో శ్రీనివాస కల్యాణాలు – పోస్టర్ ఆవిష్కరించిన టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి
తిరుమల 23 సెప్టెంబరు 2022: ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున హిందూ ధర్మ ప్రచారం చేయడంలో భాగంగా అక్టోబరు 15 నుంచి నవంబరు 13వ తేదీ వరకు యుకెయూరప్ దేశాల్లో శ్రీనివాస కల్యాణాలు నిర్వహించనున్నట్లు టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి తెలిపారు .
అన్నయ్య భవన్ లో శుక్రవారం రాత్రి ఆయన ఇందుకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు . ఈ సందర్బంగా శ్రీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ , ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులకు తొరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దగ్గర చేయాలని ముఖ్యమంత్రి
శ్రీ వై ఎస్ జగన్మోహన్ రెడ్డి టీటీడీని ఆదేశించారన్నారు . ఈ మేరకు దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఇప్పటికే శ్రీనివాస కల్యాణాలు , వైభవోత్సవాలు నిర్వహించామని తెలిపారు . ఈ ఏడాది జూన్ జులై లో అక్కడి తెలుగు సంఘాలు , ఎ పి ఎన్నార్ టి ఎస్ సహకారంతో అమెరికా లోని 9 నగరాల్లో స్వామి వారి కల్యాణాలు నిర్వహించామన్నారు , యుకె , యూరప్ తెలుగు సంఘాల సహకారం తో అక్కడి భక్తుల కోరిక మేరకు స్వామివారి కళ్యాణోత్సవాలు నిర్వహించబోతున్నామని చైర్మన్ తెలిపారు.
అక్టోబరు 15న యుకె లోని బాసింగ్ స్టేక్ ( basing stoke ), 16న మాంచెస్టర్ ( manchester ), 22న నార్తన్ ఐర్లాండ్ లోని బెల్ఫాస్ట్ ( belfast , northern ireland ), 23వ తేదీ ఐర్లాండ్ లోని డబ్లిన్ ( dublin , ఐర్లాండ్ )లో కల్యాణాలు జరుగుతాయన్నారు . అక్టోబరు 29న ఈయూ లోని జురిచ్ స్విట్జర్లాండ్ ( zurich switzerland EU ), 30వ తేదీ నెదర్లాండ్స్ లోని ఆమ్స్టర్డామ్ ( Amsterdam Netherlands EU ), నవంబరు 5న జెర్మనీ లోని ఫ్రాంక్ఫర్ట్ ( Frankfurt , Germany ), 6న పారిస్ ఫ్రాన్స్ ( Paris ,frans ) 12న లండన్ ( London )13న స్కాట్లాండ్ లోని ఎడిన్బర్గ్ ( Edinburgh , Scotland UK )లో స్వామివారి కల్యాణాలు నిర్వహించనున్నామని శ్రీసుబ్బారెడ్డి తెలిపారు .
టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీ రాంభూపాల్ రెడ్డి , శ్రీనందకుమార్ , ఎ పి ఎన్ ఆర్ టి ఎస్ అధ్యక్ష్యులు శ్రీ మేడపాటి వెంకట్ , యు కె తెలుగు అసోసియేషన్ అధ్యక్ష్యులు శ్రీ కిల్లి సత్యప్రసాద్ పాల్గొన్నారు .
టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది