TTD TO RELEASE ONLINE NOVEMBER & DECEMBER SED TICKETS ON OCTOBER 22 _ అక్టోబరు 22 న ఆన్లైన్లో శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్ల విడుదల

RELEASE NOVEMBER & DECEMBER QUOTA OF SSD TOKENS ON OCTOBER 23
 

Tirumala, 20 October 2021: TTD announced on Wednesday evening that it would release November and December quota of online Special Entry Darshan (SED) tickets at 09.00 am on October 22 excepting for December 8 and December 16.

 

 

TTD said the issue of online tickets and SSD tokens for those dates being Panchami Thirtham at Tiruchanoor Temple on December 8  & commencement of Dhanur Masam at Srivari temple on December 16 will be released after finalisation of programs at Srivari temple. 

 

 

Similarly the release of online tokens for Slotted Sarva Darshan (SSD) for November and December will be made on October 23 at 9.00am.

 

 

TTD said in a statement that November quota for allotment of accommodation at Tirumala shall be released online on October 25 at 09.00 am.

 

 

TTD appealed to devotees to make note of dates and book their tickets, tokens and accommodation online on the TTD website without fail and beget Srivari Darshan and blessings.

 

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDS, TIRUPATI

అక్టోబరు 22 న ఆన్లైన్లో శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్ల విడుదల

– అక్టోబరు 23 వ తేదీ సర్వదర్శనం టోకెన్ల విడుద

తిరుమల 20 అక్టోబరు 2021: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం నవంబరు, డిసెంబరు నెలలకు సంబంధించి రూ 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం (ఎస్ఈ డి) టోకెన్లు అక్టోబరు 22 వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. అయితే డిసెంబరు 8 వ తేదీ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి పంచమి తీర్థం, డిసెంబరు 16వ తేదీ ధనుర్మాసం ప్రారంభం అవుతుంది. ఈ రెండు రోజులకు సంబంధించి శ్రీవారి ఆలయ కార్యక్రమాలు ఇంకా ఖరారు కాలేదు. ఈ కార్యక్రమాల వివరాలు ఖరారయ్యాక డిసెంబరు 8 మరియు 16 వ తేదీలకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లు విడుదల చేస్తారు.

నవంబరు నెలకు సంబంధించిన స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు అక్టోబరు 23వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్లైన్ లో విడుదల చేస్తారు.

తిరుమలలో వసతికి సంబంధించి నవంబరు నెల కోటాను అక్టోబరు 25వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్లైన్ లో విడుదల చేయడం జరుగుతుందని టీటీడీ తెలిపింది.

భక్తులు ఈ విషయం గుర్తించి స్వామి వారి దర్శనం టోకెన్లు, తిరుమలలో వసతి బుక్ చేసుకోవాలని టీటీడీ కోరుతోంది.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది