అక్టోబ‌రు 1న ఖాళి టిన్‌ల విక్ర‌యానికి సీల్డ్ టెండ‌ర్ల‌ ఆహ్వానం

అక్టోబ‌రు 1న ఖాళి టిన్‌ల విక్ర‌యానికి సీల్డ్ టెండ‌ర్ల‌ ఆహ్వానం
 
 తిరుపతి, 2021 సెప్టెంబ‌రు 27: తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాల్లో నెయ్యి, నూనె, జీడిప‌ప్పు ప్యాకింగ్‌కు వినియోగించిన ఖాళి టిన్‌లు రేటు కాంట్రాక్టు కింద సీల్డ్ టెండ‌ర్ల‌ను టిటిడి ఆహ్వానిస్తోంది. టెండ‌ర్ పొందిన వారు డిసెంబ‌రు – 2021 వ‌ర‌కు టిటిడి వినియోగించిన ఖాళి టిన్‌లు సేక‌రించ‌వ‌చ్చు.

తిరుపతిలోని హరేకృష్ణ రోడ్డులో గల మార్కెటింగ్ (వేలం) కార్యాలయంలో సీల్డ్ టెండ‌ర్లు అక్టోబ‌రు 1వ‌ తేదీ మ‌ధ్యాహ్నం 3 గంట‌లలోపు అంద‌జేయ‌వ‌లెను. ఇతర వివరాలకు మార్కెటింగ్ (వేలం) కార్యాలయాన్ని 0877-2264429 నంబరులో సంప్రదించగలరు.                              

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.