TTD CHAIRMAN SURPRISE INSPECTION AT OLD ANNA PRASADAM COMPLEX _ అన్నదానం కాంప్లెక్స్ లో టీటీడీ చైర్మన్ ఆకస్మిక తనిఖీలు

Tirumala,16 January 2023: TTD Chairman Sri YV Subba Reddy on Monday afternoon conducted a surprise inspection of the old  Anna Prasadam Complex and directed officials to put sunshades for devotees and also keep premises hygiene.

During his interaction with devotees he also tasted and enquired about the quality of Prasadam to which the devotees expressed satisfaction. Later he dined along with the pilgrims.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

అన్నదానం కాంప్లెక్స్ లో టీటీడీ చైర్మన్ ఆకస్మిక తనిఖీలు

తిరుమల 16 జనవరి 2023: తిరుమలలోని పాత అన్నదానం కాంప్లెక్స్ లో సోమవారం మధ్యాహ్నం టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి ఆకస్మిక తనిఖీలు చేశారు. క్యూ లైన్లో ఉన్న భక్తులతో ఆయన మాట్లాడారు. క్యూలో ఉండే భక్తులు ఎండకు ఇబ్బంది పడకుండా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశిస్తానని ఆయన చెప్పారు. అన్నప్రసాదాలు ఎలా ఉన్నాయని చైర్మన్ భక్తులను అడగడంతో బాగున్నాయని వారు చెప్పారు.

అన్నదానం భవనంతో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని అక్కడి సిబ్బందిని శ్రీ సుబ్బారెడ్డి ఆదేశించారు. అనంతరం ఆయన భక్తులతో పాటు కూర్చుని అన్న ప్రసాదం స్వీకరించారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది