SRIVARI ANNA PRASASDAM DAILY TO 1.40LAKH NEEDY PEOPLE _ అన్నార్థులకు శ్రీవారి అభయం

25 LAKH FOOD PACKETS TILL DATE TO STARVING PEOPLE IN TIRUPATI

 TTD MULLS SRIVARI ANNA PRASADAM IN OTHER DISTRICTS TOO

 Tirupati, 15 April 2020: Following COVID19 lockdown under the directives of central and state governments which is extended till May 3, TTD has so far distributed 25 lakh food packets starting from March 28 onwards to address hunger problem of stranded pilgrims and migrant wage earners in Tirupati.

TTD is providing 70,000 food packets each in morning and evening that is being prepared in the employee’s canteen at TTD administrative building every day. As the Employees Canteen region had now come under Red zone, food packets are being prepared at the kitchens of Srinivasam rest house, Tiruchanoor Annaprasadam complex and the Padmavati women’s college in Tirupati. 

Nearly 750 persons are working in two shifts beginning at 3 am to 11 am and 1 pm- 8 pm. TTD food packets are supplied by state government department staff to all regions of Tirupati.

TTD Executive Officer Sri Anil Kumar Singhal told media that has allocated Rs. 13 crore from the Srivari Nitya Anna Prasadam Trust at Rs.1cr each to the 13 districts of Andhra Pradesh to provide food packets to the displaced people, poor and income-less wage earners.

He requested the District Collectors to utilise the funds to distribute food packets as Srivari Anna Prasadam to needy people in their regions and if need be TTD would sanction more funds for the humanitarian purpose.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

అన్నార్థులకు శ్రీవారి అభయం
 
* రోజూ లక్ష నలభై వేల మందికి ఆకలి తీరుస్తున్న అన్న ప్రసాదం ట్రస్ట్
*  ఇప్పటి దాకా 25 లక్షలకు పైగా ఆహార పొట్లాల పంపిణీ
*  ఇతర ప్రాంతాలకూ స్వామివారి అన్నప్రసాదం  
 
తిరుపతి‌, 2020 ఏప్రిల్ 15: కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్ వల్ల తిరుపతిలో ఆగి పోయినవారు, పేదలు, వలస కూలీలు, నిరాశ్రయులెవరూ ఆకలితో ఉండరాదనే ఉద్దేశంతో టీటీడీ రోజూ  మధ్యాహ్నం70 వేలు, రాత్రి 70 వేల మందికి ఆకలి తీరుస్తోంది. గత నెల 28వతేదీ తిరుమలలో స్వామివారి ఆశీస్సులతో ప్రారంభమైన ఈ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతోంది.
 
బుధవారం దాకా 25 లక్షల పైగా  ఆహార పొట్లాలను టీటీడీ అందించింది. 28వ తేదీ తిరుమలలో అన్న ప్రసాదాలు తయారు చేయించి తిరుపతికి  తరలించి సరఫరా చేశారు. 29వ తేదీ నుంచి తిరుపతి పరిపాలనా భవనంలోని ఉద్యోగుల క్యాంటీన్ నుంచి అన్న ప్రసాదాల తయారీ ప్రారంభించింది. ఈ ప్రాంతం రెడ్ జోన్ లోకి రావడంతో శ్రీనివాసం వసతి సముదాయం, తిరుచానూరు అన్న దానం, తిరుపతి పద్మావతి మహిళా కళాశాల వంటశాలల నుంచి అన్న ప్రసాదాల తయారీ ప్రారంభించింది. 750 మంది ఉద్యోగులు, వారిని పర్యవేక్షించే అధికారులు రెండు షిఫ్టులుగా పనిచేస్తున్నారు. మొదటి షిఫ్ట్ సిబ్బంది తెల్లవారుజామున 3 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు పని చేస్తున్నారు. రెండవ షిఫ్ట్ సిబ్బంది మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 8 గంటల వరకు పనిచేస్తున్నారు.
 
తిరుపతిలోని వివిధ ప్రాంతాలలోని అన్నార్థులకు  ప్రభుత్వ శాఖల  ద్వారా  టీటీడీ అన్న ప్రసాదం పంపిణీ చేయిస్తోంది.. తిరుపతిలోనే కాకుండా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా లాక్ డౌన్ వల్ల ఇరుక్కు పోయిన వారు, పేదలు, వలస కూలీల ఆకలి తీర్చాలని టీటీడీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా  శ్రీవారి అన్న ప్రసాదం ట్రస్ట్ నుంచి జిల్లాకు కోటి రూపాయలు చొప్పున అందిస్తున్నట్లు ఈఓ శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ మంగళవారం రాత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ చెప్పారు. జిల్లా కలెక్టర్లు ఈ నిధులను ఉపయోగించి ఆకలితో ఉన్న వారికి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ప్రసాదం అందించాలని ఆయన కోరారు. అవసరమైతే మరిన్ని నిధులు కూడా ఇస్తామని ఈ ఓ చెప్పారు.
 
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.