US KALYANAMS CONCLUDES _ అమెరికాలో ముగిసిన శ్రీనివాస కల్యాణాలు

అమెరికాలో ముగిసిన శ్రీనివాస కల్యాణాలు

– భారీ సంఖ్యలో హాజరైన ప్రవాసాంధ్రులు

తిరుమల 11 జూన్ 2022: అమెరికా దేశంలో స్థిరపడిన భారతీయులు, తెలుగువారి కోసం ఎపిఎన్ఆర్టిఎస్, పలు ప్రవాసాంధ్రుల సంఘాల సహకారంతో జూన్ 18 నుంచి తొమ్మిది నగరాల్లో నిర్వహించిన శ్రీనివాస కల్యాణాలు జూలై 11వ తేదీన సోమవారం ముగిశాయి. ప్రవాసాంధ్రులు స్వామివారి కల్యాణాలను కనులారా దర్శించి తరించారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసునికి ఈ కల్యాణాలు జరిగాయి.

జూన్ 18న శాన్ ఫ్రాన్సిస్కో, 19న సియాటెల్, 25న డల్లాస్, 26న సెయింట్ లూయిస్, 30న చికాగో నగరాల్లో స్వామివారి కల్యాణాలు జరిగాయి. అదేవిధంగా, జూలై 2న న్యూ ఆర్లిన్,
3న వాషింగ్టన్ డిసి, 9వ తేదీ అట్లాంటా జులై 10న బర్మింగ్ హమ్ నగరాల్లో శ్రీవారి కళ్యాణాలు నిర్వహించారు. ఆయా నగరాల్లో నిర్వహించిన శ్రీనివాస కల్యాణాలకు విశేష స్పందన లభించింది. పెద్ద సంఖ్యలో ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు.

టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి దంపతులు పలుచోట్ల జరిగిన కల్యాణాల్లో పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది

NRI DEVOTEES FEEL THE THRILL OF DIVINE WEDDING

 

TIRUMALA, 11 JULY 2022: The series of Srinivasa Kalyanams organized by TTD along with APNRT at nine different cities in the United States of America were concluded on a grand religious note on Monday wee hours as per IST at Birmingham.

 

The celestial weddings were held from June 18 to July 10 in nine cities across the USA which included Sanfrancisco(June 18), Seattle(June 19), Dallas(June 25), St Louis(June 26), Chicago(June 30), New Orleans(July 2), Washington DC(July 3), Atlanta(July 9), Birmingham(July 10) with utmost spiritual fervour and gathered humongous response from the denizens of the respective places.

 

TTD Chairman Sri YV Subba Reddy participated in a few Srinivasa Kalyanams where in the divine marriage were held to the utsava deities of Sri Srinivasa, Sridevi and Bhudevi which was cherished by the devotees with utmost devotion and enthusiasm. 

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI