ANNUAL BRAHMOTSAVAMS WITH PILGRIM PUBLIC AFTER TWO YEARS-CHAIRMAN _ శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాలను అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హిస్తాం

VENKATESWARA VAIBHAVOTSAVAMS AT NELLORE FROM AUGUST 16-20 

TIRUMALA, 11 JULY 2022: The Srivari annual brahmotsavams which is scheduled between September 27 and October 5 will be performed with the participation of the pilgrim public after a two-year hiatus, said TTD Trust Board Chairman Sri YV Subba Reddy.

Addressing media persons along with TTD EO Sri AV Dharma Reddy after the Trust Board Meeting held at Annamaiah Bhavan in Tirumala on Monday, the Chairman said, due to Covid Pandemic restrictions, the annual brahmotsavams were performed in Ekantam in the years 2020 and 2021. “As the covid restrictions were now relaxed by Centre and State Governments, this year, we will observe the nine-day fete in a grand manner and the procession of Vahana sevas will be observed in mada streets. The Honourable CM Sri YS Jaganmohan Reddy will offer silks on behalf of the State Government on the first day of Brahmotsavams on September 27 this year. The Garuda Seva is on October 1 and Chakra Snanam on October 5”, he maintained.

Among other important decisions he said:

The Venkateswara Vaibhavotsavams will be resumed and will be observed at Nellore district from August 16 to 20

The issuance of SSD tokens in Tirupati will be resumed only after a thorough study to avoid the inconvenience of long waiting hours for tokens as well as darshan in future

The Board has given approval for tenders towards the civil works to construct Sri Padmavathi Paediatric Hospital at Rs.154.50crore

Paruveta Mandapam in Tirumala will be re-constructed at a cost of Rs.2.07crore

The greenery and floral gardens at Sri Venkateswara Divyakshetam at Amaravati in Venkatapalem of Andhra Pradesh will be developed at a cost of Rs.2.90crore

Rs.7.32crore worth fodder for cattle in SV Goshala for a period of ten months

Gold plating over copper armour to Sri Bedi Anjaneya at Rs.18.75crore

Properties donated by Dr Parvatham at Tiruvayur and Uthandi of Tamilnadu worth Rs.6crore (one house each), a 3080 sq ft apartment by Dr Ramanath V Guha at Bengaluru were taken over by TTD

To develop the IT infrastructure in SVIMS Super specialty hospital at Rs.4.42crore

To complete the pending works of OCTOPUS base camp in Tirumala at Rs.7crore

To study the Mechanisation of Potu with the latest state-of-art equipment (from Australia and Switzerland) to prepare boondi automatically in a hygienic environment.

The SV High School which has 638 pupils in Tirumala to be developed as a Model School with the help of Singhania Educational Trust which has come forward to train the teachers and the students in improving the quality of education

TTD will print 33lakh copies of different types of its diaries and calendars for the year 2023 and also 2.10lakh copies of Sapthagiri magazine in all the five languages every month

Approval to purchase a dozen organic products produced through natural farming techniques for preparing Srivari Prasadams

Gold Malam works of Ananda Nilayam Vimanam will be taken up as per the advise of Agama Pundits

TUDA Chairman and TTD Ex-officio Dr C Bhaskar Reddy, TTD Board members, JEOs Smt Sada Bhargavi, Sri Veerabrahmam, Endowments Commissioner Sri Hari Jawaharlal were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాలను అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హిస్తాం

– ఆగ‌స్టు 16 నుండి 20వ తేదీ వ‌ర‌కు నెల్లూరులో శ్రీ వేంక‌టేశ్వ‌ర వైభ‌వోత్స‌వాలు

– టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వై.వి.సుబ్బారెడ్డి

తిరుమల, 2022 జులై 11: శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాల‌ను సెప్టెంబ‌రు 27 నుండి అక్టోబ‌రు 5వ తేదీ వ‌ర‌కు అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హిస్తామ‌ని, క‌రోనా కార‌ణంగా రెండేళ్ల త‌రువాత మాడ వీధుల్లో వాహ‌న‌సేవ‌లు నిర్వ‌హించి భ‌క్తుల‌కు స్వామివారి ద‌ర్శ‌నం క‌ల్పిస్తామ‌ని టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు. బ్ర‌హ్మోత్స‌వాల తొలిరోజు ధ్వ‌జారోహ‌ణం సంద‌ర్భంగా రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫున ముఖ్య‌మంత్రివ‌ర్యులు శ్రీ వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి స్వామివారికి ప‌టువ‌స్త్రాలు స‌మ‌ర్పిస్తార‌ని తెలియ‌జేశారు. అక్టోబ‌రు 1న గ‌రుడ సేవ జ‌రుగ‌నుంద‌ని చెప్పారు. తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో సోమ‌వారం శ్రీ వై.వి.సుబ్బారెడ్డి అధ్య‌క్ష‌త‌న‌ టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌మావేశం జ‌రిగింది. ధర్మకర్తల మండలి స‌మావేశంలో తీసుకున్న నిర్ణ‌యాల‌ వివ‌రాలు ఇలా ఉన్నాయి.

– ఆగ‌స్టు 16 నుండి 20వ తేదీ వ‌ర‌కు నెల్లూరులో శ్రీ వేంక‌టేశ్వ‌ర వైభ‌వోత్స‌వాలు నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యం.

– తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నార్థం వ‌చ్చే భ‌క్తుల‌ను ఎలాంటి టోకెన్ లేకుండా నేరుగా ద‌ర్శ‌నానికి పంపే విధానం కొన‌సాగుతుంది. భ‌క్తుల‌కు ఎలాంటి అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా ద‌ర్శ‌నం చేయించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాం. తిరుప‌తిలో స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ కౌంట‌ర్ల ఏర్పాటుకు సంబంధించి స‌మ‌గ్రంగా అధ్య‌య‌నం చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించాం.

– రూ.154.50 కోట్ల వ్యయంతో తిరుపతిలో శ్రీ పద్మావతి పీడియాట్రిక్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి టెండ‌ర్లు ఆమోదం.

– రూ.2.07 కోట్లతో తిరుమల పార్వేట మండపం స్థానంలో నూతన మండపం నిర్మాణానికి టెండర్లకు ఆమోదం.

– తిరుమ‌ల‌లో అక్టోప‌స్ బేస్‌క్యాంప్‌లో మిగిలి ఉన్న ప‌నుల‌ను రూ.7 కోట్ల‌తో పూర్తి చేయ‌డానికి నిర్ణ‌యం.

– రూ7.32 కోట్లతో ఎస్వీ గోశాలలో 10 నెలల కాలానికి గాను పశువుల దాణా కొనుగోలుకు ఆమోదం.

– రూ.2.90 కోట్లతో అమరావతిలోని శ్రీవారి ఆలయం వద్ద పూల‌తోట‌ల పెంప‌కం, పచ్చదనం పెంపొందించేందుకు ఆమోదం.

– రూ.18.75 ల‌క్ష‌లతో తిరుమ‌ల‌లోని శ్రీ బేడి ఆంజ‌నేయ‌స్వామివారి మూల‌మూర్తికి రాగి క‌వ‌చాల‌పై బంగారు తాప‌డం ప‌నులు చేప‌ట్టేందుకు ఆమోదం.

– తిరుమలలోని ఎస్వీ ప్రాథమిక పాఠశాల, ఎస్వీ ఉన్నత పాఠశాల అభివృద్ధికి ముంబ‌యికి చెందిన సింఘానియా ఎడ్యుకేషన్ ట్ర‌స్టు ముందుకొచ్చింది. ఇక్కడున్న 638 మంది విద్యార్థులకు, ఉపాధ్యాయులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణతోపాటు మౌలిక స‌దుపాయాలు క‌ల్పించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాం.

– 2023వ సంవ‌త్స‌రానికి సంబంధించి 8 ర‌కాల క్యాలెండ‌ర్లు, డైరీలు మొత్తం క‌లిపి 33 ల‌క్ష‌ల ప్ర‌తులు ముద్రించాల‌ని నిర్ణ‌యం.

– స‌ప్త‌గిరి మాస‌ప‌త్రిక‌ను 5 భాష‌ల్లో నెల‌కు 2.10 ల‌క్ష‌ల కాపీలు ముద్రించేందుకు ఆమోదం.

– చెన్నైకి చెందిన డాక్టర్ పర్వతం అనే భక్తురాలు తిరువాన్మయూర్, ఉత్తాండి ప్రాంతాల్లో రూ.6 కోట్లు విలువ చేసే రెండు ఇళ్లను శ్రీవారికి కానుకగా అందించాలని ముందుకు రాగా వాటిని స్వీకరించేందుకు ఆమోదం.

– అమెరికాకు చెందిన డా. రామ‌నాథం గుహ బెంగ‌ళూరులోని డాల‌ర్స్ కాల‌నీలో ఉన్న రూ.3.23 కోట్ల విలువ‌చేసే అపార్ట్‌మెంట్‌ను స్వామివారికి విరాళంగా ఇచ్చేందుకు ముందుకొచ్చారు. ఈ విరాళాన్ని స్వీక‌రించ‌డానికి ఆమోదం.

– రూ.4.42 కోట్ల‌తో స్విమ్స్‌లో రోగుల, డాక్ట‌ర్ల, ఇత‌ర అన్ని వివ‌రాల‌ను నిక్షిప్తం చేసేలా ఐటి ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ ఏర్పాటుకు టెండ‌ర్ల ఆమోదం.

– తిరుమ‌ల బూందీపోటు ఆధునీక‌ర‌ణ కోసం ఆస్ట్రేలియా, స్విట్జ‌ర్లాండ్‌కు చెందిన సంస్థ‌లు ప్ర‌తిపాదించిన ఆధునిక సాంకేతిక ప‌రిజ్ఞానంపై అధ్య‌య‌నం చేయాల‌ని అధికారులకు ఆదేశం.

– గో ఆధారిత ప్ర‌కృతి వ్య‌వ‌సాయాన్ని ప్రోత్స‌హించేందుకు మార్క్‌ఫెడ్ ద్వారా 12 ర‌కాల ఉత్ప‌త్తుల కొనుగోలుకు నిర్ణ‌యం. ధ‌ర‌ల ఖ‌రారుకు మార్క్‌ఫెడ్ అధికారుల‌తో అవ‌గాహ‌న కుదుర్చుకున్నాం.

– తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌య ఆనంద‌నిల‌యం బంగారు తాప‌డం ప‌నుల‌పై ఆగ‌మ‌పండితుల‌తో చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకుంటాం.

టిటిడి ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీ హరిజవహర్ లాల్, బోర్డు స‌భ్యులు శ్రీ చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి, శ్రీ పోక‌ల అశోక్‌కుమార్‌, శ్రీ కాట‌సాని రాంభూపాల్ రెడ్డి, శ్రీ కృష్ణారావు, శ్రీ పార్థ‌సార‌ధి రెడ్డి, శ్రీ మారుతీ ప్ర‌సాద్‌, శ్రీ రాజేష్‌కుమార్ శ‌ర్మ‌, శ్రీ మొరంశెట్టి రాములు, శ్రీ నంద‌కుమార్‌, శ్రీ విద్యాసాగ‌ర్ రావు, శ్రీ స‌న‌త్ కుమార్‌, శ్రీ శ‌శిధ‌ర్‌, శ్రీ‌మ‌తి మ‌ల్లీశ్వ‌రి, శ్రీ శంక‌ర్‌, శ్రీ విశ్వ‌నాథ్, శ్రీ మ‌ధుసూద‌న్ యాద‌వ్‌, శ్రీ సంజీవ‌య్య‌, శ్రీ వైద్య‌నాథ‌న్ కృష్ణ‌మూర్తి, జెఈవోలు శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి, శ్రీ వీర‌బ్ర‌హ్మం ఈ స‌మావేశంలో పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయ‌బ‌డిన‌ది.