అలరించిన అన్నమయ్య సంకీర్తనా గానం
అలరించిన అన్నమయ్య సంకీర్తనా గానం
ఒంటిమిట్ట, 2023 ఏప్రిల్ 03: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజు సోమవారం టిటిడి ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో నిర్వహించిన ధార్మిక, సంగీత కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
ఈ సందర్భంగా శ్రీ వేణుగోపాల్ బృందం ఆలపించిన అన్నమయ్య సంకీర్తనలు భక్తిభావాన్ని పంచాయి. వీటిలో ‘కొండలలో నెలకొన్న కోనేటిరాయుడు వాడు…’, ‘ఆదిపురుష అఖిలాంతరంగా…’, ‘గోవిందా గోవిందా అని కొలువరే…’, ‘నారాయణుడు ఇతడే….’ తదితర కీర్తనలు ఉన్నాయి.
ముందుగా ఉదయం ఎస్వీ సంగీత కళాశాల అధ్యాపకులు మంగళధ్వని వినిపించారు. ఆ తరువాత డా. విద్యానిధి ఆచార్యులు ‘శ్రీమద్రామాయణంలో హనుమంతుని సేవాధర్మం’ అనే అంశంపై ధార్మికోపన్యాసం చేశారు. సాయంత్రం భక్తిసంగీతం వీనులవిందుగా సాగింది. రాత్రి శ్రీ వై.రమణయ్య బృందం ‘అన్నమయ్య జననం’ అనే అంశంపై హరికథాగానం చేశారు.
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.