TTD SPECIAL DRIVE ON AWARENESS ON ORGAN DONATION _ అవయవదానం పై అవగాహనకు చర్యలు – జిల్లా యంత్రాంగం, ప్రైవేట్ ఆసుపత్రులతో సమావేశానికి ఈవో ఆదేశం

TTD EO DIRECTS SPECIAL SESSION WITH PRIVATE HOSPITALS AND DISTRICT ADMINISTRATION

Tirupati, 20 April 2023: TTD EO Sri AV Dharma Reddy on Thursday directed officials to promote steps to organise a special session with private hospitals and district administration to spread awareness on organ donation among the public and TTD employees.

Addressing a review meeting at his chambers in the TTD administrative building with the TTD JEO for Health and Education Smt Sada Bhargavi, the EO said three more children are waiting for heart transplant operations besides the recent successfully performed twin operations at Sri Padmavati Children’s Heart Centre(SPCHC).

He instructed officials to be vigilant on brain dead to promote organ donors.

He also suggested the officials to promote Family doctor programs at all TTD hospitals SVIMS, BIRRD Aswini, central hospitals at rate of one doctor for every 40 TTD employees and keep tab of family profiles.

 TTD will organise transportation and collection of organs with Air Ambulance at Sri Padmavati Children’s Heart Centre, providing expert cardiologists and the medical equipment needed.

He also said TTD will promote tie-ups with health insurance companies for promoting surgeries and a special website in BIRRD hospital spreading awareness among the public about cheaper CT scans, angioplasty tests etc. and also modernising the artificial limbs centre.

He also directed officials of SV ayurvedic hospital to install CC camera for the security of patients and also appoint more staff needed in the popular Panchakarma treatment centre.

TTD FA&FAO Sri Balaji, Director of SPCHC Dr Srinath Reddy’s, BIRRD OSD Dr Reddappa Reddy, In charge CMO Dr Narmada, Ayurvedic hospital doctor Dr Subba Reddy.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

అవయవదానం పై అవగాహనకు చర్యలు – జిల్లా యంత్రాంగం, ప్రైవేట్ ఆసుపత్రులతో సమావేశానికి ఈవో ఆదేశం

తిరుపతి 20 ఏప్రిల్ 2023: అవయవదానం పై టీటీడీ ఉద్యోగులు, ప్రజలకు అవగాహన కల్పించి ప్రోత్సహించడానికి తగిన చర్యలు తీసుకోవాలని టీటీడీ ఈవో శ్రీ ఎ వి ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందులోభాగంగా జిల్లా అధికార యంత్రాంగం, తిరుపతి లోని ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలతో సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు.

టీటీడీ పరిపాలన భవనం లోని తన చాంబర్ లో ఈవో శ్రీ ధర్మారెడ్డి జేఈవో శ్రీమతి సదా భార్గవితో కలసి గురువారం టీటీడీ ఆసుపత్రుల పై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, శ్రీపద్మావతి చిన్న పిల్లల గుండె చికిత్సల ఆసుపత్రిలో ఇటీవలే రెండు గుండె మార్పిడి ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించిన విషయం గుర్తు చేశారు. మరో ముగ్గురు చిన్నారులు గుండె మార్పిడి శస్త్రచికిత్స కోసం ఎదురు చూస్తున్నట్లు ఆయన తెలిపారు. తిరుపతి ఆసుపత్రుల్లో ఎవరైనా బ్రైన్ డెడ్ అయిన వ్యక్తుల నుంచి గుండె సేకరించగలిగే అవకాశం లభిస్తే భవిష్యత్తులో ఎక్కువ మంది చిన్నారులకు గుండె మార్పిడి శస్త్ర చికిత్సలు చేయవచ్చని ఈవో అభిప్రాయ పడ్డారు. టీటీడీ ఉద్యోగుల్లో కూడా అవయవదానంపై అవగాహన కల్పించడానికి చర్యలు తీసుకోవాలని చెప్పారు.

టీటీడీ ఆధ్వర్యంలోని స్విమ్స్, బర్డ్, అశ్విని, సెంట్రల్ ఆసుపత్రుల్లోని డాక్టర్లందరికీ ఒకరికి 40మంది చొప్పున టీటీడీ రెగ్యులర్ ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులను కేటాయించి ఫ్యామిలీ డాక్టర్ పథకం అమలు చేయాలని సూచించారు. ఇందుకు సంబంధించిన డేటా మొత్తం సిద్ధం చేసి ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులతో డాక్టర్లను అనుసంధానం చేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. శ్రీపద్మావతి చిన్నపిల్లల గుండె ఆసుపత్రిలో గుండె మార్పిడి శస్త్ర చికిత్సల కోసం గుండె సేకరణ, రవాణాకు అవసరమైతే ఎయిర్ అంబులెన్స్ కూడా ఉపయోగించుకోవడానికి తగిన ఏర్పాట్లు చేస్తామని ఈవో చెప్పారు. ఇందుకు అవసరమైన సదుపాయాలన్నీ కల్పిస్తామని తెలిపారు. చిన్న పిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి అవసరమయ్యే వైద్య నిపుణుల నియామకం, యంత్ర సామగ్రి కొనుగోలుకు ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించాలన్నారు.

బర్డ్ ఆసుపత్రికి హెల్త్ ఇన్స్యూరెన్స్ సంస్థలతో టైఅప్ చేసుకుని సర్జరీలు నిర్వహించడానికి ఈవో అంగీకరించారు. బర్డ్ కు ప్రత్యేకంగా వెబ్సైట్ సిద్ధం చేయాలన్నారు. ఈ ఆసుపత్రిలో తక్కువ ధరకే సి.టి. స్కాన్, సి.టి. యాంజియో లాంటి పరీక్షలు చేస్తున్న విషయం ప్రజలందరికీ తెలిసేలా ప్రచారం చేయాలన్నారు.దీనివల్ల పేదలు, మధ్యతరగతి వారికి చాలా భారం తగ్గుతుందని శ్రీ ధర్మారెడ్డి చెప్పారు. కృత్రిమ అవయవాల తయారీ కేంద్రాన్ని ఆధునీకరించడానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
ఎస్వీ ఆయుర్వేద ఆసుపత్రిలో భద్రత చర్యల్లో భాగంగా అవసరమైనన్ని సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. పంచకర్మ చికిత్సకు పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తున్నందువల్ల ఈ విభాగానికి అవసరమైనంతమంది సిబ్బందిని నియమించుకోవాలని ఆయన ఆదేశించారు.

టీటీడీ ఎఫ్ఎసిఎవో శ్రీ బాలాజి, శ్రీ పద్మావతి చిన్న పిల్లల గుండె చికిత్సల ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ రెడ్డి, బర్డ్ ప్రత్యేకాధికారి డాక్టర్ రెడ్డెప్ప రెడ్డి, ఇంచార్జ్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నర్మద, ఆయుర్వేద ఆసుపత్రి వైద్యులు డాక్టర్ సుబ్బారెడ్డి సమీక్షలో పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది