SEAMLESS SCOPE FOR MANUSCRIPTS RESEARCH- TTD JEO ( E& H) _ ఆకాశమే హద్దుగా తాళ పత్రాల పరిశోధనలు- జాతీయ సెమినార్ లో టీటీడీ జేఈవో శ్రీమతి సదా భార్గవి

MANUSCRIPT PROJECT AIMS AT NATIONAL WEALTH PROTECTION

 

Tirupati, 01 July 2023: TTD JEO for Health and Education Smt Sada Bhargavi said on Saturday that the TTD manuscripts digitisation project has no boundaries.

 

Addressing a two-day national seminar on Manuscript digitisation technologies organised by the Sri Venkateswara Vedic University the JEO said manuscripts from all over the country are gathered for the purpose of digitisation and arrangements are made to preserve them for over 500 years.

 

She said anyone individual or institutions could bring their age-old documents and take it back in digital format.

 

The project on the directives of TTD EO has been doing incredible progress and digitised valuable manuscripts which are also brought out as a book in coordination with the Sanatana Jeevan Trust.

 

She said the Seminar aimed to empower people on the purpose of digitisation, to preserve manuscripts and technologies involving the project.

 

Speaking on the occasion Acharya Krishna Murthy, VC of National Sanskrit University said the TTD has launched the noble task of empowering and preserving ancient knowledge embedded in manuscripts.

 

The VC of SVVU Acharya Rani Sadasiva Murty presided over the seminar.

 

SVBC CEO Sri Shanmukh Kumar, Sanatana Jeevan Trust representative, Hyderabad Chaitanya Bharati institute of Technology professor and manuscripts researcher Sri Narahari Shastri, OSD of Manuscripts Project Smt Vijayalakshmi, SVVU registrar Acharya Radhe Shyam and manuscripts researchers from across the country were present.

 

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఆకాశమే హద్దుగా తాళ పత్రాల పరిశోధనలు

– జాతి సంపదను పరిరక్షించడానికే మాన్ స్క్రిప్ట్ ప్రాజెక్టు

– జాతీయ సెమినార్ లో టీటీడీ జేఈవో శ్రీమతి సదా భార్గవి

తిరుపతి 1 జూలై 2023: సనాతన భారతీయ విజ్ఞానం దాగి ఉన్న తాళపత్రాల్లోని విషయాలను నేటి తరానికి అందించడానికి ఆకాశమే హద్దుగా టీటీడీ పరిశోధనలు చేస్తోందని జేఈవో శ్రీమతి సదా భార్గవి చెప్పారు.

శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో “”మాన్ స్క్రిప్ట్ డిజిటైజేషన్ టెక్నాలజీస్”” పై రెండు రోజుల జాతీయ స్థాయి సెమినార్ శనివారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి శ్రీమతి సదా భార్గవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, శ్రీ వేంకటేశ్వర మాన్ స్క్రిప్ట్ ప్రాజెక్టు ద్వారా దేశం నలుమూలల నుండి తాళ పత్రాలు సేకరించి వాటిని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం తో డిజిటైజ్ చేస్తున్నామని చెప్పారు. డిజిటైజ్ చేసిన తాళ పత్రాలను 500 సంవత్సరాలు గడిచినా చెక్కు చెదరని విధంగా భద్రపరచే ఏర్పాట్లు చేస్తున్నట్లు జేఈవో వివరించారు. వ్యక్తులు, సంస్థలు తమ వద్ద తాళ పత్రాలు ఉంటే మాన్ స్క్రిప్ట్ ప్రాజెక్టు కు తెచ్చి వాటిని డిజిటైజ్ చేసుకుని వెళ్లొచ్చన్నారు. భావి తరాలకు ఉపయోగపడే తాళ పత్రాలను పుస్తక రూపంలోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి మార్గదర్శనంలో ఈ ప్రాజెక్టు ఏడాది కాలంగా బ్రహ్మాండంగా పని చేస్తోందన్నారు. సనాతన జీవన్ ట్రస్ట్ సహకారంతో తాళ పత్రాల డిజిటైజేషన్ కార్యక్రమం వేగంగా జరుగుతోందని ఆమె వివరించారు. తాళ పత్రాలు ఎందుకు డిజిటైజ్ చేయాలి, ఎలా భద్ర పరచాలి, ఇందుకోసం ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించాలనే విషయాలు తెలుసుకోవడానికి సెమినార్ ఎంతో ఉపయోగపడుతుందని శ్రీమతి సదా భార్గవి తెలిపారు.

జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కృష్ణమూర్తి మాట్లాడుతూ, భారతీయ సంస్కృతి, సంప్రదాయం, జీవన విధానాలకు సంబంధించిన అనేక విషయాలు పూర్వీకులు తాళ పత్రాల్లో పొందుపరచారని చెప్పారు. వీటిని డిజిటైజ్ చేయడం, భద్రపరచడం సామాన్య విషయం కాదన్నారు. ఈ పని టీటీడీ మాత్రమే చేయగలుగుతుందని అన్నారు.

వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య రాణి సదా శివమూర్తి సభకు అధ్యక్షత వహించారు . ఎస్వీబీసీ సిఈవో శ్రీ షణ్ముఖ్ కుమార్, సనాతన జీవన్ ట్రస్ట్ ప్రతినిధి, హైదరాబాద్ చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజి లో ఎలక్ట్రానిక్ విభాగం ప్రొఫెసర్, తాళపత్ర పరిశోధకులు శ్రీ నరహరి శాస్త్రి, మాన్ స్క్రిప్ట్ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీమతి విజయలక్ష్మి, వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య రాధే శ్యామ్ తో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుండి తాళ పత్రాల పరిశోధకులు హాజరయ్యారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది