ఆగష్టు 20న వరలక్ష్మి వ్రతం
ఆగష్టు 20న వరలక్ష్మి వ్రతం
తిరుపతి, 2010 ఆగష్టు 17: తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో ఈ నెల 20వ తేదిన వరలక్ష్మి వ్రతం వైభవంగా జరుగుతుంది. ఆర్జితంగా జరిగే ఈ పూజలో రూ.500/- చెల్లించి ఇద్దరు పాల్గొనవచ్చును.
అదేవిధంగా తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో 20వ తేదిన వరలక్షి వ్రతం ఘనంగా జరుగుతుంది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.