ఆగష్టు 5 నుండి 18వ తేది వరకు ఖమ్మం జిల్లాలో గోవింద కల్యాణాలు
ఆగష్టు 5 నుండి 18వ తేది వరకు ఖమ్మం జిల్లాలో గోవింద కల్యాణాలు
తిరుపతి, 2010 జూలై 29: తిరుమల తిరుపతి దేవస్థానములు అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గోవింద కల్యాణాలు నాల్గవ విడతగా ఆగష్టు 5వ తేది నుండి 18వ తేది వరకు ఖమ్మం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలలో వైభవంగా జరుగుతాయి.
ఈ గోవింద కల్యాణాలు ఖమ్మం జిల్లాలో క్రింది ప్రాంతాలలో ఆయా తేదీలలో జరుగుతాయి.
ప్రదేశం తేది
దమ్మపేట 05-08-2010
పెనుపల్లి 06-08-2010
యెనుకూరు 07-08-2010
టేకులపల్లి 08-08-2010
భూర్గంపహడ 09-08-2010
వెంకటాపురం 11-08-2010
చెర్ల 12-08-2010
దుమ్మగూడం 13-08-2010
కోనవరం 14-08-2010
వర రామచంద్రాపురం 16-08-2010
ఇల్లిండ్లు 18-08-2010
ఈ గోవింద కల్యాణాలలో అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతి రోజు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. అదేవిధంగా తితిదే వైద్యవిభాగం గోవిందకల్యాణాలు జరిగే ప్రతిచోట ప్రత్యేక వైద్యశిబిరాలు నిర్వహిస్తారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.