ఆగస్టు 11న మహతిలో ధార్మికోపన్యాసం

ఆగస్టు 11న మహతిలో ధార్మికోపన్యాసం

తిరుపతి, ఆగస్టు 09, 2013: తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో ఆగస్టు 11వ తేదీన మనగుడి విశిష్టతపై ధార్మిక ఉపన్యాసం నిర్వహించనున్నారు. ఆగస్టు 21వ తేదీన శ్రావణపౌర్ణమి సందర్భంగా నిర్వహించనున్న మనగుడి సమాయత్త కార్యక్రమాల్లో భాగంగా ఈ ప్రవచన కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. ఇందులో సహస్రావధాని డాక్టర్‌ గరికపాటి నరసింహారావు మనగుడి విశిష్టతను తెలియజేస్తారు. సాయంత్రం 6.00 నుండి 8.00 గంటల వరకు ఈ ప్రవచన కార్యక్రమం జరుగనుంది. పురప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని మనగుడి గొప్పదనాన్ని తెలుసుకోవాలని కోరడమైనది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.