GARUDA PANCHAMI ON AUGUST 13 _ 13న గరుడ పంచమి

GARUDA PANCHAMI ON AUGUST 13

Tirumala,12, August 2021: TTD is organizing the Garuda vahana procession of Sri Malayappaswamy on four Mada streets on Friday night on the occasion of auspicious Garuda Panchami.

 Garuda Panchami is observed annually at Tirumala and Legends say that Garuda vahana darshan on Garuda Panchami day brings happiness.

 ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఆగస్టు 13న గరుడ పంచమి

తిరుమల, 2021 ఆగస్టు 12: తిరుమ‌ల‌లో ఆగస్టు 13వ తేదీ శుక్ర‌వారంనాడు గరుడ పంచమి పర్వదినం జ‌రుగ‌నుంది. ఈ సంద‌ర్భంగా రాత్రి 7 నుండి 9 గంటల వరకు శ్రీ మలయప్పస్వామివారు త‌న‌కు ఇష్టవాహనమైన గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగి భక్తులను అనుగ్రహించ‌నున్నారు.

ప్రతి ఏడాదీ తిరుమ‌ల‌లో గరుడ పంచమిని ఘనంగా నిర్వహిస్తారు. నూతన దంపతులు తమ వైవాహిక జీవితం ఆనందదాయకంగా ఉండేందుకు, స్త్రీలు తమకు పుట్టే సంతానం గరుడునిలాగా బలశాలిగా, మంచి వ్యక్తిత్వం గలవాడిగా ఉండేందుకు ”గరుడపంచమి” పూజ చేస్తారని ప్రాశస్త్యం.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.