ఆగస్టు 14న కురుక్షేత్రలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన

ఆగస్టు 14న కురుక్షేత్రలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన

తిరుపతి, 2012 ఆగస్టు 13: కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామివారి వైభవాన్ని ఉత్తరాది భక్తులకు అందించేందుకుగాను హర్యానా రాష్ట్రంలోని చారిత్రక నగరమైన కురుక్షేత్రలో ఆలయాన్ని నిర్మించేందుకు తితిదే నిర్ణయించింది. ఆలయ నిర్మాణానికి గాను ఆగస్టు 14వ తేదీన శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనుంది. హర్యానా గవర్నర్‌ గౌ|| శ్రీ జగన్నాథ్‌ పహాడియా, ముఖ్యమంత్రి గౌ|| శ్రీ భూపిందర్‌ సింగ్‌ హుడా సమక్షంలో ఈ కార్యక్రమం జరుగనుంది. తితిదే పాలకమండలి అధ్యకక్షులు శ్రీ కనుమూరి బాపిరాజు, కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొననున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.