ఆగస్టు 20న శ్రీ ఆదిభట్ట నారాయణదాసవర్యుల 148వ జయంతి ఉత్సవాలు

ఆగస్టు 20న శ్రీ ఆదిభట్ట నారాయణదాసవర్యుల 148వ జయంతి ఉత్సవాలు

తిరుపతి, 2012 ఆగస్టు 18: తితిదే ఆధ్వర్యంలోని శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో ఆగస్టు 20వ తేదీ సోమవారం తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో హరికథా పితామహులు శ్రీ మదజ్జాడ ఆదిభట్ట నారాయణ దాసవర్యుల 148వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఉదయం 7.30 గంటల నుండి 10.30 గంటల వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉదయం 7.30 గంటలకు ఎస్వీ సంగీత కళాశాల ప్రాంగణంలో శ్రీ విఘ్నేశ్వర పూజ, శ్రీవారి అర్చన, అక్కడి నుండి మహతి కళాక్షేత్రం వరకు నగర సంకీర్తన నిర్వహిస్తారు. ఉదయం 8.30 గంటలకు హరికథ శాఖ విద్యార్థులతో యదార్థ రామాయణ కీర్తనలను బృందగానం చేస్తారు. ఉదయం 9.15 గంటలకు సదస్సు ప్రారంభమవుతుంది. అనంతరం భీష్మ విజయం, శ్రీకృష్ణరాయబారం, సతీ తులసి, భక్త మార్కండేయ, జానకీ శపథం, గజేంద్ర మోక్షణం హరికథా కార్యక్రమాలు నిర్వహిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.