PAVITROTSAVAMS IN LAKSHMI NARAYANA SWAMY TEMPLE _ ఆగస్టు 22 నుండి 24వ తేదీ వరకు శ్రీ లక్ష్మీనారాయణస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు
TIRUPATI, 19 JULY 2022: The annual Pavitrotsavams in Sri Lakshmi Narayana Swamy temple near Padala Mandapam from August 22 to 24 with Ankurarpana on August 21.
Pavitra Pratistha, Pavitra Samarpana, Pavitra Purnahuti will be performed on each of these three days respectively.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
ఆగస్టు 22 నుండి 24వ తేదీ వరకు శ్రీ లక్ష్మీనారాయణస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు
తిరుపతి, 19 జులై 2022: తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం వద్దగల శ్రీ లక్ష్మీనారాయణస్వామివారి ఆలయంలో మొదటిసారిగా ఆగస్టు 22 నుండి 24వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. ఇందుకోసం ఆగస్టు 21వ తేదీ సాయంత్రం సేనాధిపతి ఉత్సవం, మేదినీ పూజ, మృత్సంగ్రహణం, అంకురార్పణం నిర్వహిస్తారు.
ఆగస్టు 22న మొదటిరోజు యాగశాలలో పవిత్ర ప్రతిష్ఠ, శయనాధివాసం, ఆగస్టు 23న రెండో రోజు పవిత్ర సమర్పణ, యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆగస్టు 24న చివరి రోజు యాగశాలలో వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి. ఆగస్టు 23న ఉదయం స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు.
ఏడాది పొడవునా ఆలయంలో నిర్వహించే అర్చనలు, ఉత్సవాల్లో తెలియక ఏవైనా దోషాలు జరిగినా, వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రాకుండా మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.