ఆగస్టు 30 నుండి సెప్టెంబరు 1వ తేదీ వరకు వకుళమాత ఆలయంలో శ్రీ లక్ష్మీనారాయణ యజ్ఞం
ఆగస్టు 30 నుండి సెప్టెంబరు 1వ తేదీ వరకు వకుళమాత ఆలయంలో శ్రీ లక్ష్మీనారాయణ యజ్ఞం
తిరుపతి, 2023, ఆగస్టు 29: లోకక్షేమం కోసం పేరూరు బండపై గల శ్రీ వకుళమాత ఆలయంలో ఆగస్టు 30 నుండి సెప్టెంబరు 1వ తేదీ వరకు శ్రీ లక్ష్మీనారాయణ యజ్ఞం జరుగనుంది.
ఆగస్టు 30న సాయంత్రం 5 నుండి రాత్రి 8 గంటల వరకు యజ్ఞానికి అంకురార్పణ నిర్వహిస్తారు. ఆగస్టు 31న ఉదయం సరస్వతీ నవగ్రహ – సుదర్శన హోమాలు, సాయంత్రం దీపోత్సవం చేపడతారు. సెప్టెంబరు 1న లక్ష్మీపూజ, కుంకుమార్చన, మహాపూర్ణాహుతి జరుగనున్నాయి.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.