PAVITROTSVAMS CONCLUDES _ శ్రీ‌వారి ఆల‌యంలో పూర్ణాహుతితో ముగిసిన పవిత్రోత్సవాలు

TIRUMALA, 29 AUGUST 2023: The annual Pavitrotsvams concluded on a grand religious note in Tirumala temple on Tuesday.

 

As part of the festival, Snapana Tirumanjanam was performed to the utsava deities in the morning.

 

Later Purnahuti was performed marking the ceremonious conclusion of the three day annual festival.

 

HH Tirumala Pedda Jeeyangar and HH Tirumala Chinna Jeeyangar Swamijis, EO Sri AV Dharma Reddy, DyEO Sri Lokanatham, Peishkar Sri Srihari, VGO Sri Bali Reddy, Grihasta devotees were also present.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ‌వారి ఆల‌యంలో పూర్ణాహుతితో ముగిసిన పవిత్రోత్సవాలు

తిరుమల, 2023 ఆగస్టు 29: తిరుమల శ్రీవారి ఆలయంలో మూడు రోజులపాటు జరిగిన పవిత్రోత్సవాలు మంగళవారం పూర్ణాహుతితో ముగిశాయి.

ఇందులో భాగంగా ఉదయం యాగశాలలో ఋత్వికులు హోమాలు నిర్వహించారు. ఆ తరువాత శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం చేపట్టారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపుతో అభిషేకించి చివరగా చందనం పూత పూశారు. ధూపదీప హారతులు నివేదించారు.

సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు ఆల‌య నాలుగు మాడ వీధుల్లో భ‌క్తుల‌ను క‌టాక్షించారు. ఆ తరువాత పూర్ణాహుతి నిర్వహించారు. శ్రీ మలయ్పప్పస్వామివారు శ్రీదేవి, భూదేవితో కలిసి విమాన ప్రదక్షిణంగా వెళ్లి ఆలయ ప్రవేశం చేయడంతో పవిత్రోత్సవాలు ముగిశాయి.

ఈ కారణంగా ఆలయంలో అష్టదళ పాదపద్మారాధన, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది.

ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి దంపతులు, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, పేష్కార్ శ్రీ శ్రీహరి, విజివో శ్రీ బాలిరెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.