ఆగస్టు 5వ తేదిన రాష్ట్రవ్యాప్తంగా శ్రావణపూర్ణిమ

ఆగస్టు 5వ తేదిన రాష్ట్రవ్యాప్తంగా శ్రావణపూర్ణిమ

తిరుపతి, ఆగష్టు – 3,  2009: తితిదే హిందూధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో ఆగస్టు 5వ తేదిన రాష్ట్రవ్యాప్తంగా శ్రావణపూర్ణిమ సందర్భంగా ప్రత్యేకకార్యక్రమాలు నిర్వహిస్తారు.

ఈ సందర్భంగా అన్ని జిల్లా కేంద్రాలలో ఉన్న తితిదే కల్యాణమండపాలు, ప్రక్క రాష్ట్రాలలో ఉన్న తితిదే కల్యాణమండపాలలో ఉదయం 10.00 గంటలకు శ్రీనివాస కల్యాణం, రక్షాబంధనం కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తారు.

ఈ సందర్భంగా తిరుపతిలోని తితిదే పరిపాలన భవనం వెనుక గల మైదానం నందు ఈ శ్రావణమాస ఉత్సవాల సందర్భంగా ఆగస్టు 5వ తేదిన ఉదయం 10.00 గంటలకు శ్రీనివాస కల్యాణం, రక్షాబంధనం వేడుకగా నిర్వహిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.