MODERNISE AYURVEDIC HOSPITAL-JEO (H&E) _ ఆయుర్వేద ఆసుపత్రిని ఆధునీకరించాలి – టీటీడీ జేఈవో శ్రీమతి సదా భార్గవి 

ఆయుర్వేద ఆసుపత్రిని ఆధునీకరించాలి – టీటీడీ జేఈవో శ్రీమతి సదా భార్గవి

తిరుపతి, 20 మార్చి 2023: ఎస్వీ ఆయుర్వేద ఆసుపత్రిని ఆధునీకరించి మరింత అభివృద్ధి చేయాలని టీటీడీ జేఈవో శ్రీమతి సదా భార్గవి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని ఎస్వీ ఆయుర్వేద కళాశాల, ఆసుపత్రిని సోమవారం జేఈవో అధికారులతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా జేఈవో శల్య తంత్ర విభాగము, ద్రవ్య గుణ, రసశాస్త్ర సిద్ధాంత, పంచగవ్య చికిత్స పరిశోధనా కేంద్రం, చిన్నపిల్లల వార్డ్, లిచ్ థెరఫీ గది, కాయ చికిత్స వార్డు, పంచకర్మ వార్డు, సెంట్రల్ డ్రగ్ స్టోర్, డ్రెస్సింగ్ రూమ్, క్లీనికల్ ల్యాబ్, ఆపరేషన్ థియేటర్, రక్త పరీక్ష కేంద్రం, ఎక్సరే విభాగాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ వివిధ విభాగాలలో అవసరమైన ఫర్నీచర్ ,ఫ్లోరింగ్, ఇతర ఇంజనీరింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రౌండ్ ఫ్లోర్ లో ఓపిడి విభాగాన్ని ఏర్పాటు చేయాలన్నారు. ఆసుపత్రి ప్రాంగణంలో పచ్చదనాన్ని పెంపొందించాలని, పారిశుధ్యానికి పెద్దపీట వేయాలని సూచించారు.

టీటీడీ అందిస్తున్న సౌకర్యాల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. సౌకర్యాలపై రోగులు సంతృప్తి వ్యక్తం చేశారు.

తరువాత ఎస్వీ ఆయుర్వేద కళాశాలలోని తరగతి గదులు, మ్యూజియం, గ్రంథాలయం, ఇతర విభాగాలను పరిశీలించారు. ఆయుర్వేద వైద్య విద్యార్ధినుల హాస్టల్ భవనంలోని గదులను, డైనింగ్ హాల్, కిచెన్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. విద్యార్ధినులకు అందిస్తున్న వసతి, భోజన సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు.

– శిల్ప కళాశాల ప్రాంగణంలో ఎంపోరియం

అనంతరం జేఈవో ఎస్వీ శిల్పకళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ శిల్పకళాశాలలో ఉన్న ఉత్పత్తులను భక్తులకు అందుబాటులోకి తీసుకురావడానికి ఎంపోరియం ఏర్పాటు చేయాలన్నారు. ఇందుకోసం కళాశాల ప్రాంగణంలో స్థల పరిశీలన జరిగింది. ఎంపోరియం ఏర్పాటు చేయడం వలన నిత్యం వేలాది మంది భక్తులు సందర్శిస్తారని చెప్పారు.. ఒరిస్సా, కృష్ణా జిల్లా పెడన ప్రాంతాలకు వెళ్లి శిక్షణ పొందిన విద్యార్థులను ఆమె అభినందించారు అనంతరం విద్యార్థులు రూపొందించిన ఆర్ట్ గ్యాలరీని సందర్శించారు.

ఈ కార్యక్రమంలో సిఈ శ్రీ నాగేశ్వరరావు, ఎఫ్ ఏ అండ్ సిఏఓ శ్రీ బాలాజీ, ఎస్ఈ శ్రీ వెంకటేశ్వర్లు , డిఈవో శ్రీభాస్కర్ రెడ్డి,అదనపు ఆరోగ్యాధికారి డా. సునీల్, ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మురళీ కృష్ణ, ఆయుర్వేద ఆసుపత్రి సూపరిండెంట్ డా. రేణు దీక్షిత్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది

TIRUPATI, 20 MARCH 2023:  The TTD-run SV Ayurvedic Hospital should be modernised and developed according to the needs of the patients, directed TTD JEO for Health and Education Smt Sada Bhargavi to the officials concerned.  

During her inspection along with the officials on Monday evening, the JEO visited Salyatantra Department, Dravya Guna, Rasa Shastra Siddhanta, Panchagavya treatment, Paediatric ward, Leech therapy, Kaya Chikitsa, Panchakarma Ward, Central Drug Store, Clinical Lab, Diagnosis lab etc.

During her interaction with the patients, they expressed immense pleasure over the treatment being offered to them by TTD.

The JEO later interacted with the students and took a note of their requirements and instructed the concerned to complete the pending works at a fast pace.

EMPORIUM TO COME UP AT SVISTA

The JEO also paved a visit to SVISTA and instructed the officials concerned to set up an emporium in the college premises so as to encourage the students. She also lauded the students who went to Orissa, Krishna district and underwent training and visited the Art Gallery where in the various crafts by students were put on display. 

CE Sri Nageswara Rao, FACAO Sri Balaji, DEO Sri Bhaskar Reddy, Ayurvedic College Principal Dr Murali Krishna, SVISTA Principal Sri Venkat Reddy, Additional Health Officer Dr Sunil, Ayurvedic Medical Superintendent Dr Renu Dixit and others were also present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI