GRAND INTERNATIONAL YOGA DAY AT AYURVEDA COLLEGE _ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా అంతర్జాతీయ యోగ దినోత్సవం
Tirupati, 21June 2022: The International Yoga Day was grandly celebrated at the SV Ayurveda College of TTD on Tuesday with rangoli art by students on the theme of Yoga for Humanity.
The students displayed various Yoga asanas followed by a workshop on Yoga for the health of humanity.
College principal Dr Murali Krishna, Dr Yamini Diwakar, State Ayush medical officer, Dr Jyoti, Associate Professor of National Sanskrit University, Yoga department chief at university Dr Lakshmi Narayana also spoke.
Vice-principal of Ayurveda College Dr Sundaram, Dr Renu Dikshit, Dr Chandra Kishore, Dr Sunil and faculty members and students were present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
ఆయుర్వేద కళాశాలలో ఘనంగా అంతర్జాతీయ యోగ దినోత్సవం
తిరుపతి 21 జూన్ 2022: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేద కళాశాలలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు యోగ ఫర్ హ్యుమానిటీ అనే అంశాన్ని ప్రతిబింబిస్తూ కళాశాల ప్రాంగణంలో ముగ్గులు వేశారు. ఉదయం 9 నుండి 10. 30 గంటల వరకు విద్యార్థులు వివిధ యోగాసనాల ప్రదర్శన నిర్వహించారు. అనంతరం మానవాళి ఆరోగ్యంపై యోగ అనే అంశంపై వర్క్ షాప్ నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మురళీ కృష్ణ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, యోగ చికిత్సల్లో అనేక నూతన విషయాలను వివరించారు. ప్రపంచంలో యోగ చికిత్సకు ఎంత ప్రాధాన్యత ఉందో వివరిస్తూ, పలువురు శాస్త్రవేత్తలు ప్రచురించిన పరిశోధనలను తన ఉపన్యాసంలో వివరించారు. రాష్ట్ర ఆయుష్ శాఖ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ యామిని దివాకర్ మాట్లాడుతూ, పంచకోశాలు, షట్ చక్రాలలో ప్రాణశక్తి వికృతి వలన వచ్చే రుగ్మతలు, వాటి చికిత్స ఉపాయాలను వివరించారు. మధ్యాహ్నం నిర్వహించిన కార్యక్రమంలో జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జ్యోతి యోగ సూత్రాల ప్రామాణికతను, యోగ – ఆయుర్వేద సమన్వయంతో ప్రపంచ మానవాళి ఆరోగ్యం ఎలా కాపాడాలి అనే అంశాలను వివరించారు. సంస్కృత విశ్వవిద్యాలయం యోగ విభాగాధిపతి డాక్టర్ లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ, అష్టాంగ యోగ సాధనతో వచ్చే ఫలితాలు, నిజజీవితంలో వీటిని ఎలా సాధన చేయాలనే విషయాలను విపులంగా తెలియజేశారు. ఆయుర్వేద కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సుందరం, డాక్టర్ రేణు దీక్షిత్, డాక్టర్ చంద్ర కిషోర్, డాక్టర్ సునీలతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
టీటీడీ ప్రజా సంబంధాల అధికారి చే విడుదల చేయడమైనది