FOR SECURED LIFE PLANT SAPPLINGS-DEO _ ఆరోగ్యకరమైన సంతోషకరమైన జీవితానికి మొక్కలు నాటాలి – టీటీడీ డిఈవో డాక్టర్ భాస్కర్ రెడ్డి 

TIRUPATI, 05 JUNE 2023: For secured and hygienic life, growing trees is most important said TTD DEO Dr Bhaskar Reddy.

Planting saplings in SPW Degree and PG college and SPW Junior college on Monday along with faculty and students on the occasion of World Environment Day, he said in 1974 UNO declared June 5 as World Environment Day.

He called upon to completely eradicate usage of plastics as part of eco-protection.

Principals Dr Mahadevamma, Dr Bhuvaneshwari were also present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI 

 

ఆరోగ్యకరమైన సంతోషకరమైన జీవితానికి మొక్కలు నాటాలి – టీటీడీ డిఈవో డాక్టర్ భాస్కర్ రెడ్డి

తిరుపతి 5 జూన్ 2023: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సోమవారం శ్రీపద్మావతి జూనియర్, డిగ్రీ కళాశాలల ఆవరణలో అధ్యాపకులు , సిబ్బంది,విద్యార్థులు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి టీటీడీ విద్యాశాఖాధికారి డాక్టర్ ఎమ్. భాస్కర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా డిఈవో మాట్లాడుతూ, 1974లో ఐక్యరాజ్యసమితి మొదటిసారి ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఆచరించిందన్నారు . రాబోయే తరాలకు అందమైన, ఆరోగ్యకరమైన సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి మొక్కలు నాటడం ప్రతి పౌరుడి బాధ్యత అని చెప్పారు . భూమి మన ఇల్లు లాంటిదని, దాన్ని శుభ్రంగా ఆకు పచ్చగా ఉంచడానికి మొక్కలు నాటి, నీరు పోస్తూ వాటిని కాపాడాలని ఆయన వివరించారు. టీటీడీ విద్యా సంస్థలను ప్లాస్టిక్ నిషేధిత ఆవరణముగా ఉంచుకోవాలన్నారు .

డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మహదేవమ్మ , జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్
సి భువనేశ్వరి ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు . అనంతరం వీరు
శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం పక్కన తులసి మొక్కల్ని నాటారు.

ఈ కార్యక్రమాల్లో రెండు కళాశాలల అధ్యాపకులు, విద్యార్థినులు, ఎన్ఎస్ఎస్, ఎన్ సి సి విద్యార్థినులు పాల్గొని మొక్కలు నాటారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది