ఇక ప్రతినెలా శ్రీ పద్మావతి అమ్మవారికి గజవాహనోత్సవం
ఇక ప్రతినెలా శ్రీ పద్మావతి అమ్మవారికి గజవాహనోత్సవం
తిరుపతి, మార్చి 7, 2013: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి జన్మదినమైన ఉత్తరాషాడ నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రతినెలా గజవాహనోత్సవం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా మార్చి 8వ తేదీ శుక్రవారం సాయంత్రం 7.00 గంటలకు తొలి గజవాహనసేవ జరుగనుంది. సర్వాలంకారభూషితులైన అమ్మవారు గజ వాహనాన్ని అధిష్టించి ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించనున్నారు. ఇందుకోసం ఆలయాధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ఇష్టమైన గజవాహనసేవలో పాల్గొని తరలించాలని కోరడమైనది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.