”ఈనాడు” దినపత్రిక నందు ప్రచురించిన ‘దొడ్డిదారి పదోన్నతులకు రంగం’ అనే వార్తకు
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి.
”ఈనాడు” దినపత్రిక నందు ప్రచురించిన ‘దొడ్డిదారి పదోన్నతులకు రంగం’ అనే వార్తకు
వివరణ
తిరుపతి, 2012 జూలై 07: జూలై 5వ తేదీన ”ఈనాడు” దినపత్రిక నందు ప్రచురించిన ‘దొడ్డిదారి పదోన్నతులకు రంగం’ అనే శీర్షికతో ప్రచురించిన వార్త వాస్తవ దూరం.
ఐఏఎస్‌ఈ డీమ్డ్ యూనివర్సిటీలో చదువుకోవడానికి తితిదే ఎలక్ట్రికల్ విభాగంలోని ఉద్యోగులు 2003వ సంవత్సరంలో అనుమతి కోరారు. తదనుగుణంగా వారు చదువుకోవడానికి తితిదే యాజమాన్యం అనుమతి ఇచ్చింది. కొంతమంది ఇతర విశ్వవిద్యాలయంలో చదువుకున్నవారు ఇందుకు వ్యతిరేకంగా పత్రికలకు వార్తలను పంపడం వలన మరియు తితిదే యూనియన్ కూడా వ్యతిరేకంగా విజ్ఞాపన ఇవ్వడం వలన వారి డిగ్రీలను తాత్కాలిక విరమణం(జులీలిగిబిదీబీలి)లో ఉంచడం జరిగింది. కొందరు ఉద్యోగులు ఈ విషయంపై కోర్టును ఆశ్రయించారు. దీనిపై కోర్టు తీర్పును ఇస్తూ, పిటిషనరుకు విజ్ఞప్తి చేసుకోవడానికి స్వేచ్ఛను ఇచ్చి ఈ విషయమై ఇరుపక్షాల వారికి నోటీసు జారీ చేసి పరిష్కరించుటకు తితిదే యాజమాన్యానికి అధికారాన్ని ఇవ్వడం జరిగింది. తదనుగుణంగా ఐఏఎస్‌ఈ డిగ్రీ పొందినవారికి, వారిని వ్యతిరేకిస్తున్నవారికి నోటీసు జారీచేసి వారి వాదప్రతివాదాలను పొందుపరచడం జరిగింది. ఈ విషయంపై పలుమార్లు వ్రాతపూర్వకమైన లావాదేవీలు జరిపి దేవస్థానం న్యాయాధికారి, తితిదే స్థాయీ వకీలు మరియు హైకోర్టు అడ్వకేటు జనరల్ వారి న్యాయాభిప్రాయాల్ని తీసుకుని కార్యనిర్వహణాధికారివారి ఆమోదంతోనే ఈ వ్యవహారం జరుగుతున్నది.
కనుక పైతెల్పిన వాస్తవాల్ని రేపటి మీ దినపత్రికనందు వివరణగా ప్రచురించాల్సినదిగా కోరడమైనది.
ప్రజాసంబంధాల అధికారి