ఈ నెల 12వ తేది నుండి 14వ తేది వరకు శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు

ఈ నెల 12వ తేది నుండి 14వ తేది వరకు శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు

తిరుపతి, జూలై 08, 2011: తిరుపతిలోని శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఈ నెల 12వ తేది నుండి 14వ తేది వరకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు వైభవంగా జరుగుతాయి. 11వ తేదీన అంకురార్పణ జరుగును.

వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌచం, మృతాశౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయినా యాత్రీకుల వల్లగాని, సిబ్బంది వల్ల గాని తెలిసి తెలియక ఇటువంటి దోషాలు జరుగుతుంటాయి. ఇలాంటి వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాది మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహిస్తుంటారు. ఈ పవిత్రోత్సవాలలో ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం వంటి కార్యక్రమాలు ఉంటాయి.

ఈ పవిత్రోత్సవంను ఆర్జితం సేవగా ప్రవేశ పెట్టారు. రూ.500 చెల్లించి ఇద్దరు గృహస్థులు పాల్గొనవచ్చును.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.