ఈ నెల 15వ తేదిన సనాతన ధార్మిక విజ్జాన పరీక్షల విజేతలకు బహుమతుల ప్రదానోత్సవం
ఈ నెల 15వ తేదిన సనాతన ధార్మిక విజ్జాన పరీక్షల విజేతలకు బహుమతుల ప్రదానోత్సవం
తిరుమల, డిశెంబర్-05, 2009: తిరుమల తిరుపతి దేవస్థానములు, హిందూధర్మప్రచార పరిషత్తు ఆధ్వర్యంలో ఫిబ్రవరి 28వ తేదిన 28వ రాష్ట్ర స్థాయి సనాతన ధార్మిక విజ్జాన పరీక్షలు జరిగాయి. ఇందులో పాల్గొని విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బంగారు, వెండిపతకాలు, నగదు బహుమతుల ప్రదానోత్సవం ఈ నెల 15వ తేదిన స్థానిక మహతి ఆడిటోరియం నందు జరుగుతుంది.
ఈ రాష్ట్రస్థాయి సనాతన ధార్మిక విజ్ఞాన పరీక్షల్లో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1,37,000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వీరిలో రాష్ట్రస్థాయిలో 6 బంగారు పతకాలు, జిల్లా స్థాయిలో ప్రతి జిల్లాకు రజిత పతకాలు ఇవ్వబడుతాయి. 144 మంది విద్యార్థులు విజేతలుగా నిలిచారు. వీరికి డిశెంబరు 15వ తేది సాయంత్రం 4 గంటలకు తిరుపతి మహతి ఆడిటోరియంలో బహుమతి ప్రధానం జరుగుతుంది. బహుమతి స్వీకరించడానికి విచ్చేయు విద్యార్థులతోపాటు ఒక ఉపాధ్యాయుడు ఒక సంరక్షకునికి కూడా ప్రయాణ చార్జీలు, తిరుపతిలో వసతి, శ్రీవారి దర్శనం ఏర్పాటు చేస్తారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా తితిదే ఛైర్మన్ డి.కె.ఆదికేశవులునాయుడు, కార్యనిర్వహణ అధికారి ఐ.వై.ఆర్.కృష్ణారావు ఇతర ఉన్నతాధికారులు పాల్గొంటారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.