ఈ నెల 28వ తేదిన కల్యాణమస్తు
ఈ నెల 28వ తేదిన కల్యాణమస్తు
తిరుపతి, అక్టోబర్-12,2009: తిరుమల తిరుపతి దేవస్థానములు నిర్వహిస్తున్న కల్యాణమస్తు కార్యక్రమం ఈ నెల 28వ తేదిన అన్ని జిల్లాలో జరుగనున్నది. ఈ కార్యక్రమంపై అవగాహన కల్పించడానికి ఇప్పటికే తితిదే ఉన్నతాధికారులు జిల్లాల కేంద్రాలకు చేరుకున్నారు.
ఈనెల 13వ తేదిన ప్రకాశం, నెల్లూరు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, వైజాగ్ తదితర జిల్లాలో ఉదయం 11 గంటలకు ఆయా జిల్లా కేంద్రాలలో అవగాహన సదస్సులు జరుగుతాయి. అదేవిధంగా అదేరోజు సాయంత్రం 3 గంటలకు కడప, విజయనగరం జిల్లా కేంద్రాలలో జరుగగా, సాయంత్రం 5 గంటలకు శ్రీకాకుళం, చిత్తూరు జిల్లాలో ఈసదస్సులు జరుగుతాయి. ఈనెల 14వ తేది ఉదయం 10 గంటలకు అనంతపురం జిల్లా కేంద్రంలో ఈ కల్యాణమస్తు అవగాహన సదస్సు జరుగుతుంది. ఆయా జిల్లాల కలెక్టర్లు అధ్యక్షతన ఈఅవగాహన సదస్సులు జరుగుతాయి. ఇందులో స్థానిక మంత్రులు, ఎం.పి.లు, ఎం.ఎల్.ఎలు, ఎం.ఎల్.సి.లు, సర్పంచ్లు, ఇతర ప్రజాప్రతినిధులు, శ్రీవారి సేవకులు, అధికారులు, మహిళాసంఘాలు, ప్రజలందరు పాల్గొనాలని కోరడమైనది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.