WOMEN EMPOWERMENT ESSENTIAL FOR BETTER SOCIETY SAYS TTD BOARD MEMBER SMT SUDHA NARAYANA MURTHY _ ఉత్తమ సమాజ నిర్మాణానికి మహిళలకు విద్య అవసరం – టిటిడి ధర్మకర్తల మండలి సభ్యురాలు శ్రీమతి సుధానారాయణ మూర్తి
Tirupati, 30 Dec. 19: TTD Trust Board member and eminent social worker Dr.Sudha Narayana Murthy said that women empowerment is essential ingredient for the development of a good society.
Addressing the students in the seminar hall during her visit to Sri Padmavathi Women’s Degree and PG College, Smt Murthy said only educated and empowered women are successful in building a good family, society and thereby a nation.
Earlier TTD DEO Dr Ramana Prasad and college principal Dr K Mahadevamma welcomed the dignitary and highlighted the activities of the TTD educational institutions.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
ఉత్తమ సమాజ నిర్మాణానికి మహిళలకు విద్య అవసరం – టిటిడి ధర్మకర్తల మండలి సభ్యురాలు శ్రీమతి సుధానారాయణ మూర్తి
తిరుపతి, 2019 డిసెంబరు 30: ఉత్తమ సమాజ నిర్మాణానికి ప్రతి మహిళ విద్యను అభ్యసించాలని, తద్వారా నిర్ణయాత్మక పాత్ర పోషించగలరని టిటిడి ధర్మకర్తల మండలి సభ్యురాలు డా.. సుధానారాయణ మూర్తి ఉద్ఘాటించారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళ డిగ్రీ మరియు పిజి కళాశాలను సోమవారం ఉదయం డా.. సుధానారాయణ మూర్తి సందర్శించారు.
ఈ సందర్భంగా డా.. సుధానారాయణ మూర్తి కళాశాలలోని సెమినార్ హాల్‌లో విద్యార్థునులతో మాట్లాడుతూ మహిళలు విద్యావంతులైతే కుటుంబం, సమాజం, దేశం అభివృద్ధి సాధిస్తాయని చెప్పారు. సమాజంలో ఆడపిల్లలు మసలుకోవలసిన విధానంపై వారికి దిశానిర్ధేశం చేశారు. అనంతరం విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు ఆమె చిరునవ్వుతో సమాదానమిచ్చారు.
అంతకుముందు టిటిడి ధర్మకర్తల మండలి సభ్యురాలు శ్రీమతి సుధానారాయణ మూర్తికి టిటిడి డిఈవో డా.రమణ ప్రసాద్, కళాశాల ప్రిన్సిపల్ డా.కె.మహదేవమ్మ స్వాగతం పలికి, కళాశాల నిర్వహిస్తున్న కార్యక్రమాలను వివరించారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.