EMPLOYEES SHOULD WORK WITH SPORTSMANSHIP – TTD CHAIRMAN SRI BHUMANA KARUNAKARA REDDY _ ఉద్యోగులు క్రీడాస్ఫూర్తితో ప‌నిచేయాలి- ⁠టీటీడీ ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి

 – COMMENCEMENT OF ANNUAL SPORTS COMPETITIONS FOR EMPLOYEES

TIRUPATI, 01 MARCH 2024: TTD Chairman Sri Bhumana Karunakara Reddy, said that the employees should work with sportsmanship in the service of God and provide better services to the devotees. 

The annual sports competition for the TTD employees started on Friday at the Parade Grounds the administration building in Tirupati.

On this occasion, TTD EO Sri AV Dharma Reddy made sports pledge with the employees. 

First, Chairman and the EO jointly unveiled the sports flag followed by letting off the Pigeons and later employees conducted a march past.

The Chairman, who was the chief guest of the program, said that to reduce the mental stress of the TTD employees and to increase their interest in sports, it has become customary to conduct sports competitions every year.  He said that physical endurance and rejuvenation comes with sports.  He said that his board has allocated Rs.10 crore towards the construction of an indoor stadium considering the interest of the employees towards sports. Employees are asked to show good talent and participate in sports to win prizes.

Smt. Snehalatha, Deputy EO of TTD Welfare Department said that every year since 1977 sports competitions are being conducted for the employees for their welfare and their mental development.  Last year, 829 men and 422 women participated.  In these competitions, the first place winners will be awarded Rs.2 thousand, the second place winners will be awarded Rs.1800/- and the third place winners will be awarded bank gift cards worth Rs.1600/-, she added.

On this occasion, the TTD Chairman and EO started playing volleyball.  In the inaugural program, the names of the employees registered to participate in the sports, the teams, the competition schedule and other details were informed. 

Separate competitions are being held for men and women employees.  It includes tug of war, chess, volleyball, caroms, ball badminton, football, table tennis, cricket, shuttle, tennis and other sports.  Along with the parade ground, sports competitions will also be organized for the employees at the Recreation Hall, SV High School Ground, SV Junior College Ground, SV Arts College Ground and Srinivasa Sports Complex.

TTD JEO Sri. Veerabrahamam, CVSO Sri. Narasimha Kishore, Chief Engineer Sri. Nageswara Rao, Chief Audit Officer Sri. Sesha Sailendra, CPRO Dr. T. Ravi, VGO Sri. Balireddy and employees participated in this program.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

ఉద్యోగులు క్రీడాస్ఫూర్తితో ప‌నిచేయాలి

•⁠ ⁠టీటీడీ ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి

•⁠ ⁠ఉద్యోగుల వార్షిక క్రీడాపోటీలు ప్రారంభం

తిరుప‌తి, 2024, మార్చి 01: భ‌గ‌వంతుని సేవ‌లో ఉద్యోగులు క్రీడాస్ఫూర్తితో ప‌నిచేసి భ‌క్తుల‌కు మెరుగైన సేవ‌లు అందించాల‌ని టీటీడీ ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి కోరారు. ఉద్యోగుల వార్షిక క్రీడాపోటీలు శుక్ర‌వారం తిరుప‌తిలోని టీటీడీ ప‌రిపాల‌నా భ‌వ‌నంలో గ‌ల ప‌రేడ్ మైదానంలో ప్రారంభమ‌య్యాయి. ఈ సంద‌ర్భంగా ఈవో శ్రీ ఏవి.ధ‌ర్మారెడ్డి ఉద్యోగుల‌తో క్రీడాప్ర‌తిజ్ఞ చేయించారు. ముందుగా ఛైర్మ‌న్‌, ఈవో క‌లిసి క్రీడాప‌తాకాన్ని ఆవిష్క‌రించారు. బెలూన్లు, శాంతి క‌పోతాల‌ను ఎగుర‌వేశారు. ఈ సంద‌ర్భంగా ఉద్యోగులు మార్చ్‌ఫాస్ట్ నిర్వ‌హించారు.

ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఛైర్మ‌న్ మాట్లాడుతూ టీటీడీ ఉద్యోగుల‌కు మాన‌సిక ఒత్తిడిని త‌గ్గించేందుకు, క్రీడ‌ల ప‌ట్ల ఆస‌క్తిని పెంచేందుకు ప్ర‌తి సంవ‌త్స‌రం క్రీడాపోటీలు నిర్వ‌హించ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంద‌న్నారు. క్రీడ‌ల‌తో శారీర‌క దారుఢ్యంతోపాటు పున‌రుత్తేజం క‌లుగుతుంద‌ని చెప్పారు. ఉద్యోగుల‌కు క్రీడ‌ల ప‌ట్ల ఉన్న శ్ర‌ద్ధ‌ను గ‌మ‌నించి ఇండోర్ స్టేడియం నిర్మాణానికి తమ బోర్డు రూ.10 కోట్లు కేటాయించిన‌ట్టు తెలిపారు. ఉద్యోగులు మంచి ప్ర‌తిభ క‌న‌బ‌రిచి క్రీడ‌ల్లో పాల్గొని బ‌హుమ‌తులు గెలుచుకోవాల‌ని కోరారు.

టిటిడి సంక్షేమ విభాగం డెప్యూటీ ఈఓ శ్రీమతి స్నేహలత మాట్లాడుతూ ఉద్యోగుల సంక్షేమం, వారి మాన‌సిక వికాసం కోసం 1977వ సంవ‌త్స‌రం నుండి ప్ర‌తి సంవ‌త్స‌రం ఉద్యోగుల‌కు క్రీడాపోటీలు నిర్వ‌హిస్తున్న‌ట్టు తెలిపారు. గ‌తేడాది 829 మంది పురుషులు, 422 మంది మ‌హిళ‌లు పాల్గొన్న‌ట్టు చెప్పారు. ఈ పోటీల్లో మొద‌టి స్థానం గెలుచుకున్న వారికి రూ.2వేలు, రెండో స్థానంలో నిలిచిన వారికి రూ.1800/-, మూడో స్థానంలో నిలిచిన‌వారికి రూ.1600/- విలువగ‌ల బ్యాంకు గిఫ్ట్‌కార్డులు బ‌హుమ‌తులు అంద‌జేస్తామ‌న్నారు.

ఈ సంద‌ర్భంగా ఛైర్మ‌న్‌, ఈవో వాలీబాల్ ఆడి క్రీడ‌ల‌ను ప్రారంభించారు. ప్రారంభ కార్యక్రమంలో క్రీడల్లో పాల్గొనేందుకు నమోదు చేసుకున్న ఉద్యోగుల పేర్లు, టీమ్‌లు, పోటీ షెడ్యూల్‌ తదితర వివరాలు తెలియజేశారు. పురుషులకు, మహిళలకు వేరువేరుగా పోటీలు నిర్వహిస్తారు. ఇందులో టగ్‌ ఆఫ్‌ వార్‌, చెస్‌, వాలీబాల్‌, క్యారమ్స్‌, బాల్‌ బ్యాడ్మింటన్‌, ఫుట్‌బాల్‌, టేబుల్‌ టెన్నిస్‌, క్రికెట్‌, షటిల్‌, టెన్నిస్‌ తదితర క్రీడలు ఉన్నాయి. పరేడ్ మైదానంతో పాటు రిక్రియేషన్ హాల్, ఎస్వీ హైస్కూల్ మైదానం, ఎస్వీ జూనియర్ కళాశాల మైదానం, ఎస్వీ ఆర్ట్స్ కళాశాల మైదానం, శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్సులో ఉద్యోగులకు క్రీడాపోటీలు నిర్వహిస్తారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం, సివిఎస్వో శ్రీ న‌ర‌సింహకిషోర్‌, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వ‌ర‌రావు, ముఖ్య గ‌ణాంకాధికారి శ్రీ శేష‌శైలేంద్ర‌, సీపీఆర్వో డా.టి.ర‌వి, విజిఓ శ్రీ బాలిరెడ్డి, ఉద్యోగులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.