TTD CHAIRMAN INSPECTS LOCATION NEAR MBC FOR MINI ANNA PRASADAM COMPLEX _ ఎంబిసి వద్ద మినీ అన్నదానం కాంప్లెక్స్ 

Tirumala, 16 January 2023:  TTD Chairman Sri YV Subba Reddy on Monday directed officials to set up a mini Anna Prasadam Complex near the MBC area in Tirumala for the benefit of devotees coming up through Srivari Mettu footpath.

The Chairman along with officials inspected the location for the Mini Anna Prasadam Complex near MBC and directed officials to make all arrangements to provide Anna Prasadam to devotees.

Thereafter he also inspected the residences at RTC Bus stand area, the proposed Matrusri Tarigonda Vengamamba Dhyana Mandiram and directed officials to prepare design and call tenders.

As part of Kanuma festivities, the TTD Chairman also performed Go puja at SV Goshala.

TTD Estate OSD Sri Mallikarjuna, VGO Sri Bali Reddy and others were present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఎంబిసి వద్ద మినీ అన్నదానం కాంప్లెక్స్
– స్థల పరిశీలన చేసిన టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి

తిరుమల 16 జనవరి 2023: శ్రీవారి మెట్టు నడకదారిలో వచ్చే భక్తుల సౌకర్యం కోసం ఎంబిసి ప్రాంతంలో మినీ అన్నదానం కాంప్లెక్స్ ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు.

సోమవారం ఆయన అధికారులతో కలసి శ్రీవారి మెట్టునుంచి భక్తులు తిరుమలకు చేరుకునే ప్రాంతాన్ని పరిశీలించారు. నడచి వచ్చిన పలువురు భక్తులతో మాట్లాడారు. ఈ ప్రాంతంలో మినీ అన్నదానం కాంప్లెక్స్ ఏర్పాటు చేయడానికి భూమి చదును చేయాలని, తగిన వసతులు ఏర్పాటు చేసి భక్తులకు అన్నప్రసాదం అందించడానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు.

అనంతరం ఆర్బిసి సెంటర్లోని నివాస గృహాలను పరిశీలించి, వాటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ ఆరాధన కేంద్రం నిర్మాణ ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. ఆరాధన కేంద్రం నిర్మాణ ప్రాంతంలో ఇంకా మిగిలిఉన్న ఇళ్ళను తొలగించి పార్కింగ్ ప్రాంతంగా తయారు చేయాలని అధికారులకు సూచించారు. ఆరాధన కేంద్రం నిర్మాణ డిజెన్లు త్వరగా ఖరారు చేసి టెండర్లు పిలిచేలా చర్యలు తీసుకోవాలన్నారు.

గో పూజలో పాల్గొన్న చైర్మన్

కనుమ పండుగ సందర్బంగా తిరుమల లోని గోశాలలో సోమవారం నిర్వహించిన గోపూజలో చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి పాల్గొన్నారు. గోమాతకు పూలు, పసుపు, కుంకుమ, నూతన వస్త్రాలు సమర్పించి పూజలు చేశారు.

ఎస్టేట్ విభాగం ఒఎస్డీ శ్రీ మల్లిఖార్జున,విజివో శ్రీ బాలిరెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది