ఎస్వీబీసీ వెబ్సైట్ పునరుద్ధరణకు చర్యలు
ఎస్వీబీసీ వెబ్సైట్ పునరుద్ధరణకు చర్యలు
తిరుపతి, 2020 జూలై 02: శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌కు సంబంధించిన www.svbcttd.com వెబ్సైట్ కాలపరిమితి జూన్ 30వ తేదీతో ముగిసింది. ఈ వెబ్సైట్ డొమైన్ రెన్యువల్ కోసం సంబంధిత అధికారులు అవసరమైన చర్యలు తీసుకున్నారు. కరోనా నేపథ్యంలో డొమైన్ సకాలంలో రెన్యువల్ కానుందువల్ల జూన్ 30వ తేదీన డౌన్ అయింది. దీంతో www.svbcttd.com వెబ్‌సైట్‌పై క్లిక్ చేస్తే ఎస్వీబీసీకి సంబంధం లేని వెబ్సైట్లు వస్తున్నాయి. దీన్ని గమనించిన టిటిడి ఐటి విభాగం డొమైన్ పునరుద్ధరణకు చర్యలు చేపట్టింది.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.